ఆంధ్రప్రదేశ్‌

మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తను నియమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తను వెంటనే నియమించాలని కేవీపీఎస్, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీల ఆధ్వర్యంలో నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో వి రాజారత్నం అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ఈవిషయమై రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిని కలవాలని, వారు స్పందించని పక్షంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకుని విజయవాడలో ధర్నా చేయాలని తీర్మానించారు. రాష్ట్రాల్లో హక్కుల కమిషన్ ఏర్పాటు చేయకపోవటమే కాదు, దానిలో పోస్టులు భర్తీ చేయకపోవటం కూడా మానవ హక్కుల చట్టం ఉద్దేశ్యానికి, కమిషన్ ఏర్పాటు ఉద్దేశ్యానికి విఘాతం కల్పించడమేనని సుప్రీం కోర్టు 2015లో డీకే బాసు కేసులో అభిప్రాయపడిందని పేర్కొన్నారు. కమిషన్ ఎప్పుడూ పనిచేసే విధంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు ఖాళీలను తప్పనిసరిగా భర్తీ చేయాలని, దీనికిమించి భర్తీ చేయకపోవటానికి ఎలాంటి వివరణలు ఉండకూడదని కోర్టు తేల్చి చెప్పిందన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు పనిచేస్తున్న మన మానవ హక్కుల కమిషన్ సమస్యలకు నిలయంగా మారిందని, 2015 మధ్య నుంచి కమిషన్ సభ్యుల పదవీ విరమణ జరగ్గా, 2016 డిసెంబర్‌లో చైర్మన్ పదవీ విరమణ చేశారన్నారు. సభ్యుల పదవీ విరమణ సమయం నుంచి కొన్నాళ్లు కమిషన్ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారని, తర్వాత ఆ పదవి కూడా ఖాళీ అయ్యిందన్నారు. కొనే్నళ్లుగా మన మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్, సభ్యుల నియామకం జరగలేదని, పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో లోకాయుక్త సంస్థలో ముఖ్యమైన పదవులు ఖాళీగా ఉన్నాయని, చైర్మన్ రిటైరైన తర్వాత మళ్లీ నియామకాలకు చర్యలు తీసుకోనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే రాష్ట్రంలో లోకాయుక్తను నియమించాల్సి ఉందని తీర్మానించారు. సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పొత్తూరి సురేష్ కుమార్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, న్యాయవాదులు సంపర శ్రీనివాసరావు, రాము, విజయకుమార్, నిరంజన్, శ్రీనివాసరావు, సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకులు మోతుకూరి వెంకటేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఆర్ మూర్తి, అరుణాచలం, తదితరులు పాల్గొన్నారు.