ఆంధ్రప్రదేశ్‌

సీఎం జగన్‌కు ఎమ్మెల్యేల సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 23: దేశంలో ఏ రాష్ట్రంలోలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం నామినేటెడ్ పదవులతో పాటు 50 శాతం కాంట్రాక్ట్ పనుల్లో రిజర్వేషన్ కల్పించటంతో పాటు బీసీల అభ్యున్నతికి ప్రత్యేక బీసీ కమిషన్, మహిళలకు సమాన అవకాశాలు కల్పించే బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని ఆయా వర్గాల ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ ప్రాంగణంలోని చాంబర్‌లో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ను ఎమ్మెల్యేలు ఘనంగా సత్కరించారు. తమ ప్రభుత్వ నిర్ణయాలు శాసనసభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గవని హర్షం తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు గతించినా అణగారిన వర్గాలు అంతరాలకు గురవుతూనే ఉన్నాయని ఈ పరిస్థితుల్లో సీఎం సంచలన నిర్ణయాలు ప్రకటించి పీడిత వర్గాల పక్షపాతిగా నిలిచారని ప్రస్తుతించారు. ఈ సందర్భంగా సీఎంను దుశ్శాలువలు, కిరీటంతో సన్మానించారు. కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజని, ధనలక్ష్మి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని సత్కరిస్తున్న బీసీ ఎమ్మెల్యేలు