ఆంధ్రప్రదేశ్‌

విభజనతో అన్నీ కష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 24: రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రం అన్నివిధాలా కష్టాల్లో ఉందని, రాష్ట్ర అభివృద్ధితో పాటు కాపుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేస్తున్న కృషికి ఆకర్షితుడినై తాను టిడిపిలో చేరానని కేంద్ర మాజీ మంత్రి, రాజంపేట మాజీ ఎంపి ఏ.సాయిప్రతాప్ పేర్కొన్నారు. గురువారం ఆయన ‘ఆంధ్రభూమి’తో ఫోన్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారన్నారు. ఆ ప్రభావంతో ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవు అన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి సిఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలతో తాను టిడిపిలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. కాపులకు అన్నివిధాలా చేయూతనిస్తున్నారని, దశాబ్దాల కాలంగా పాలించిన ప్రభుత్వాలు హామీలిచ్చాయే తప్ప ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కాపులు సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి వున్నారని, బాబు అన్నిరంగాల్లో తమకు న్యాయం చేయగలరన్న నమ్మకంతో తాను పార్టీలో చేరినట్లు ప్రకటించారు. రాయలసీమ జిల్లాల్లో కాపుల అభీష్టం మేరకే తాను పార్టీలో చేరానన్నారు. తాను రాజకీయ భవిష్యత్తు కోసం తాపత్రయ పడటం లేదని స్పష్టం చేశారు.
సీమ అభివృద్ధే ధ్యేయం
కడప జిల్లా నుంచి ఆరు పర్యాయాలు ఎంపిగా గెలుపొందిన ఏ.సాయిప్రతాప్ ఎట్టకేలకు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిలెక్కారు. సాయిప్రతాప్ సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సంప్రదింపులు జరిపారు. గురువారం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు) నేతృత్వంలో సాయిప్రతాప్ సిఎం చంద్రబాబును కలిశారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సమక్షంలో ఆయన టిడిపిలో లాంఛనంగా చేరారు.