ఆంధ్రప్రదేశ్‌

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: కృష్ణా పుష్కరాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. విజయవాడకు సగటున కనీసం పది లక్షల మంది పైగా యాత్రికులు తరలివస్తుండటంతో దుమ్ము, ధూళి వలన, జలుబు, దగ్గు వంటి స్వల్ప రుగ్మతలు ఒకరి నుంచి మరొకరికి ప్రబలుతున్నాయి. నీటి కాలుష్యం వల్ల వైరల్ ఫీవర్స్, ఇతర రుగ్మతలు విజృంభిస్తున్నాయి. దీనికి తోడు మలేరియా, డెంగ్యూ వంటి అనుమానాలతో వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మెట్టపల్లి జగన్మోహనరావు తెలిపారు. ఓపి విభాగంలో పరీక్షలు నిర్వహిస్తున్న హెచ్‌ఓడి ప్రొ.కె.సత్యనారాయణ మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనను పూర్తిగా అరికట్టి, మురుగునీరు నదిలో కలువకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. క్లోరినేషన్ బ్యాగులను ఉంచుతూ ప్రతి నాలుగు లేదా ఐదు గంటలకోసారి బ్యాగులను మారుస్తున్నారు. స్వరాజ్య మైదానంలో శ్రీవారి నమూనా ఆలయ మందిరం సిబ్బందికి బుధవారం ముందుగా టైఫాయిడ్ వ్యాక్సిన్‌లు ఇచ్చారు. దోమకాటు వల్ల టైఫాయిడ్ జ్వరం రాకుండా ఉండే వ్యాక్సిన్లు వేస్తున్నామని తితిదె కేంద్రీయ వైద్యశాల వైద్యులు క్రాంతికుమార్, ఫార్మాసిస్టు గోపీనాధ్ తెలిపారు.