ఆంధ్రప్రదేశ్‌

నిరుద్యోగ సమస్యపై పోరాడండి యువజన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మండల స్థాయిలో నిరుద్యోగుల డేటా సేకరించాలని ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ప్రారంభించాలని అనంతరం రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల సమక్షంలో ఎండగట్టే కార్యక్రమాలు చేపట్టాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. అమాయక నిరుద్యోగుల్లో ఆశలు పురిగొల్పి వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేసేందుకు శ్రద్ధ వహించడం లేదంటూ దుయ్యబట్టారు. ఆంధ్రరత్న భవన్‌లో ఏర్పాటైన యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్, జాతీయ కార్యదర్శి ఎపి ఇన్‌చార్జి మానత్ మల్లికతో కల్సి రఘువీరారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన తుగ్లక్‌ను మరిపిస్తున్నాయన్నారు. ఎఐసిసి, పిసిసిఏ పిలుపు నిచ్చినా యువజన కాంగ్రెస్ ముందుండి పోరాటాలు సాగించాలని అలాగే అనుబంధ సంస్థలు ఇచ్చిన పిలుపులకు కూడా తక్షణం స్పందించాలన్నారు. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అవిర్భవించినప్పుడు ఇదే ఆంధ్రరత్న భవన్ నూనూగుమీసాల యువకులతో నిండిపోయిందంటూ మళ్లీ కాంగ్రెస్‌కు పూర్వవైభవాన్ని తీసుకురావటానికి యువకులే ముందుకు రావాలంటూ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయితా కిషోర్ అధ్యక్షత జరిగిన ఈ సభలో మాజీ మంత్రులు శైలజానాధ్, దేవినేని నెహ్రూ, జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, మల్లాది విష్ణు, ఎస్‌ఎన్ రాజా, ఆకుల శ్రీనివాసకుమార్, రాజేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.