ఆంధ్రప్రదేశ్‌

రేపే ఏపిఇఆర్‌సి సలహా సంఘం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని, విద్యుత్ సరఫరాపై ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ అన్నారు. ఈ నెల 19వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా అమరావతిలోనే ఏపిఇఆర్‌సి సలహా మండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డిస్కంల ఆర్థిక ఆరోగ్యం బాగుంటేనే విద్యుత్ రంగం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపిఇఆర్‌సి ఉన్నత స్ధాయి ప్రమాణాలతో పనిచేస్తోందన్నారు. బుధవారం ఇంధన శాఖ కార్యదర్శి, ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్ ఏపిఇఆర్‌సి చైర్మన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన అమరావతిలోనే సలహామండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు, విద్యుత్ చట్టం అమలు, డిస్కంల పనితీరు, సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్ధలు, విద్యుత్ ఉత్పత్తిపై ఈ సమావేశంలో చర్చిస్తామని అజయ్ జైన్ చెప్పారు. ఈ సమావేశానికి సిఐఐ, ఫ్యాప్సీ, విద్యుత్, రైల్వే, పౌరసరఫరాల శాఖ, విద్యా రంగం నిపుణులను ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు.