ఆంధ్రప్రదేశ్‌

విషాదాన్ని దాచి... పరీక్ష రాయంచి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదుకూరు, మార్చి 24: పదవ తరగతి పరీక్ష జరుగుతుండగా తల్లి మరణించడంతో విద్యార్థి భవిష్యత్తు దృష్ట్యా టీచర్లు ఆ విషయాన్ని పరీక్ష రాయించారు. ఈ సంఘటన గురువారం కడప జిల్లా మైదుకూరు మండలంలో చోటుచేసుకుంది. మైదుకూరు మండల పరిధిలోని విశ్వనాథపురం పంచాయతీ గంగవరం గ్రామానికి చెందిన కొవ్వూరు రఫి గత కొనే్నళ్లుగా మైదుకూరు పట్టణంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో గురువారం రఫీ కూడా అందరు విద్యార్థుల్లాగే పరీక్ష రాసేందుకు సన్నద్ధమయ్యాడు. రఫి తండ్రి హుసేనయ్య ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. బుధవారం తల్లి వీరమ్మ తమ గ్రామంలో వ్యవసాయ కూలి పని కోసం వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకూ మండుటెండలో పనిచేసి ఇంటికి వచ్చింది. దీంతో అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ఆమెను వెంటనే మైదుకూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కడపకు తరలిస్తుండగా బుధవారం రాత్రి మార్గమధ్యలో మృతి చెందింది. ఆమె కుమారుడు రఫి గురువారం ఉదయం పదవ తరగతి హిందీ పరీక్ష రాయనుండటంతో తల్లి మరణించిన విషయాన్ని విద్యార్థికి తెలపకుండా దాచారు. ఈ నేపథ్యంలో రఫి ఉదయానే్న అందరిలాగే పరీక్ష రాస్తుండగా అతని తల్లి మరణవార్తను విలేఖరులు మైదుకూరు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం వెంకటలక్ష్మమ్మ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె ఈ సమాచారాన్ని డిఇఓ ప్రతాపరెడ్డికి చేరవేసింది. వెంటనే ఆయన మైదుకూరుకు వచ్చి పరీక్షల అనంతరం రఫిని తన దగ్గరకు పిలిపించుకుని నిమ్మరసం తాగించి తల్లి మరణించిన విషయాన్ని తెలిపారు. దీంతో రఫి ఒక్కసారిగా దుఃఖాన్ని ఆపుకోలేక బోరున విలపించాడు. ఈ ఘటన అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. వెంటనే డిఇఓ రఫిని తన వాహనంలో ఎక్కించుకుని గంగవరం గ్రామానికి తీసుకెళ్లి తల్లి మృతదేహాన్ని చూపించి విద్యార్థితో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.