ఆంధ్రప్రదేశ్‌

నియోజకవర్గాల వారీగా సమీక్ష అవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 13: ఆకలి అయినప్పుడే అన్నం పెట్టాలని, అప్పుడే అన్నం విలువ తెలుస్తుందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. విజయవాడలో మంగళవారం జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ పరంగా ప్రజలకు చాలా చేశామన్నారు. కానీ ఇంకా ఏదో ఆశించి ప్రజలు వైకాపాకు ఓటు వేశారన్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపితే పార్టీ పరిస్థితి ఏమిటో తెలుస్తుందన్నారు. ఇప్పుడే జనంలోకి వెళ్లవద్దని, మనం ప్రజలకు అవసరమైనప్పుడు మాత్రమే వెళ్దామని వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, పార్టీ సమావేశానికి పలువురు నేతలు గైర్హాజరయ్యారు. పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, జేసీ సోదరులు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ గణబాబు తదితరులు హాజరు కాలేదు. అనారోగ్యం, విదేశీ పర్యటన కారణంగా రాలేదని తెలుస్తోంది.
చంద్రబాబు చేతికి గాయం
చంద్రబాబు నాయుడు చేతికి గాయం అవడంతో కుడి చేతికి కట్టుతో పార్టీ సమావేశానికి హాజరయ్యారు. చేతి నరంపై ఒత్తిడి పెరగడంతో వైద్యులు కట్టుకట్టినట్లు తెలిసింది. చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లనున్నట్లు తెలిసింది.