రాష్ట్రీయం

రైల్వే శాఖ ప్రేమంతా ‘రాయగడ’పైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 18: ఘన చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్ లేకుండా చేసినా, విశాఖ కేంద్రంగా కొత్త జోన్ కార్యకలాపాలు ఇంకా ఆరంభం కాకపోయినా ఏమాత్రం దృష్టిసారించని కేంద్రం ఇప్పుడు రాయగడ కొత్త డివిజనపైనే అతిగా ప్రేమ చూపిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాల్తేర్ డివిజన్ కోల్పోవడంతో ఈస్ట్‌కోస్ట్‌రైల్వేలో అతి ముఖ్యమైన రాయగడ కొత్త డివిజన్ నిర్మాణమైంది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు చకాచగా జరిగిపోతున్నాయి. ఓఎస్‌డిని నియమించారు. ఇది కాకుండా ఇటీవల కొత్త డివిజన్ సరిహద్దులు నిర్దేశించడం, నియమ నిబంధనలు రూపొందించడం, ఉద్యోగుల ఆప్షన్ విధానానికి శ్రీకారం చుట్టడం 12 కీలక విభాగాలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలను వేగవంతం చేసే కార్యక్రమాలకు మరో ప్రత్యేక అధికారిని నియమించింది. ఇది మంచిదే అయినా వాల్తేర్ నిర్లక్ష్యానికి గురవుతోందంటూ ఇక్కడి కార్మికవర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
మారనున్న రైల్వే కార్మికుల ఉద్యమ పంథా
నిన్న మొన్నటివరకు విశాఖ కేంద్రంగా కొత్తగా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలనే ఉద్యమాలు జరిగేవి. అయితే ఉద్యమ తీవ్రత, రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం జోన్‌ను ప్రకటించిన కేంద్రం 126ఏళ్ల ఘన చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్‌ను లేకుండా చేసేసింది. ఇప్పుడు జోన్ వచ్చిందనే ఆనందం కంటే కూడా వాల్తేర్ డివిజన్‌ను కోల్పోయామన్న బాధే ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పుడు దీని ఉనికిని ఏవిధంగా కాపాడుకోవాలనే లక్ష్యంతోనే త్వరలో కార్యాచరణ రూపకల్పన కానుంది. జోన్ వచ్చిందనే సంతృప్తి ఏమాత్రం చూపని ఉత్తరాంధ్రవాసులు, రైల్వే కార్మికవర్గం ఇకనుంచి డివిజన్‌ను కాపాడుకునేందుకు మరో ఉద్యమానికే సన్నద్ధం అవుతోంది. అవసరమైతే జోన్ లేకపోయినా డివిజన్ కోసమే పట్టుబట్టాలనే కొత్త అంశం తెరమీదకు రానుంది.
డివిజన్ కేంద్రంగా ఉన్న విజయవాడలోనే జోన్ కేంద్ర కార్యాలయం ఉంటే మంచిదనే భావన రైల్వే నుంచి ఎలాగూ వ్యక్తం అవుతోంది. అందువల్ల దీనిని అక్కడకు తీసుకువెళ్లిపోయినా వాల్తేర్‌ను మాత్రం ఎలాగైనా కాపాడుకోవాలనే అంశంపైనే ఇప్పుడు ఉద్యమకారులు దృష్టిసారిస్తున్నారు. వాల్తేర్ డివిజన్‌ను కోల్పోవడం వలన దాదాపుగా 20వేల మంది కార్మికుల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ప్రతీ చిన్న విషయానికి విజయవాడకు పరుగులు తీయాల్సిందే. అనారోగ్యం పాలై సెలవు పెట్టుకోవాలన్నా, పీఎఫ్ పనుల కోసం, బదిలీలు, పదోన్నతులు, చివరకు రుణ సదుపాయం, వైద్య కోసం ఖచ్చితంగా డివిజన్ హెడ్ క్వార్టర్‌కే వెళ్ళాల్సిన పరిస్థితులు రైల్వే కార్మికవర్గాల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. విశాఖ నుంచి 700కిలోమీటర్లకు పైబడే దూరంలో ఉన్న విజయవాడకు వెళ్లాలంటే ఎదురయ్యే అనేక సమస్యలపైన కార్మికవర్గం ఆలోచనలో పడుతోంది. పోనీ ఎనిమిది మాసాల కిందట ఏర్పడిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ వలన ప్రయోజనాలు ఉన్నాయంటే దీని వలన కార్మికులకు కలసొచ్చేది ఇసుమంతైనా లేదనేది ఇప్పటికే స్పష్టమైపోయింది. ప్రస్తుతం భువనేశ్వర్ హెడ్‌క్వార్టర్‌గా ఉన్న జోన్ ఉన్నప్పటికీ భువనేశ్వర్‌కు ఏ కార్మికునికి వెళ్లే పని లేకుండా పోతోంది. అధికారుల్లో ఏ కొద్దిమందో పరిపాలనాపరమైన, ప్రాజెక్టులకు సంబంధించి వెళ్తుంటారు. తప్పితే వేలాది మంది కార్మికుల విధుల నిర్వహణ, అనేక కార్యకలాపాలకు వెళ్ళాల్సిన పనే ఉండటంలేదు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఉన్న రైల్వేజోన్ వచ్చినా దీని ద్వారా కార్మికులకు ఒరిగేదంటూ ఏమీ ఉండదు. జోన్ ఇక్కడ, డివిజన్ విజయవాడలో అన్నట్టుగా ఉండే దూరం ఇప్పుడు అధికారులు, కార్మికవర్గం మధ్య కూడా అగాధం మరింతగా పెరగనుంది. దీనివల్ల సమన్వయం లోపిస్తుందని, కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయంటూ కార్మికవర్గం చెబుతోంది.
ఈ విధమైన అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొనే కంటే భవితవ్యం కోసమైనా వాల్తేర్ ఉనికిని కాపాడుకునే బలమైన ఉద్యమానికి సన్నద్ధం కావాలనే ఆలోచనలో ఉంది. దీనికంటే ముందుగా జోన్‌ను వదులుకునేందుకు కూడా సిద్ధపడాలనే భావం వ్యక్తమవుతోంది. డివిజన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే కార్మికవర్గం తమ ఆలోచనను ప్రజల్లోకి తీసుకువెళ్ళి, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, ఆయా రాజకీయపార్టీల సహకారాన్ని కోరాలని నిర్ణయించింది.