ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 20: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల అపరిష్కృత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజయవాడ ఎన్జీవో హోంలో మంగళవారం జరిగిన ఏపీ జేఏసీ రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం డిమాండ్ చేసింది. జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. సీపీఎస్‌ను తక్షణం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని, ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలని, ఉపాధ్యాయుల సాధారణ బదిలీలను దసరా సెలవుల్లో చేపట్టాలని, నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.