ఆంధ్రప్రదేశ్‌

సీఎం జగన్ అమెరికాలో ఉండి ప్రజలను వరదల్లో ముంచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 21: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అమెరికాలో ఉండి ప్రజలను వరదల్లో ముంచారని టీడీపీ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. జగన్ అసమర్థ పాలనను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. ఎంతో అభివృద్ధి చెందుతున్న రాజధానిని ఇడుపులపాయకు తీసుకెళ్ళేందుకు కుట్ర పన్నుతున్నారంటూ విజయవాడ టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో దేవినేని ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నవ్యాంధ్రలో అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి పనులు నిలిపివేశారని అన్నారు. కృష్ణపట్నం పోర్టు కొట్టేయాలని చూస్తే కుదరలేదన్నారు. పోలవరం పనులు నిలిపివేశారు, బందరు పోర్టు ఆగిపోయింది, ఈ ప్రభుత్వ పాలనలో పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. అందుకే రద్దులపై రద్దులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వలన ఆంధ్రప్రదేశ్‌కి వరదలు వస్తే, అమెరికా వెళ్లిన ముఖ్యమంత్రి వరదలపై కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్తూ తమ నేతలకు ఫలానా ప్రాంతంలో భూములు కొనుక్కోమని చెప్పారా.. లేదా.. అని ఉమా ప్రశ్నించారు.