ఆంధ్రప్రదేశ్‌

‘ఫర్నిచర్’పై ఏ విచారణకైనా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫర్నిచర్ వ్యవహారంపై ఎలాంటి విచారణ చేపట్టినా తాను సిద్ధంగా ఉన్నానని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం గుంటూరులోని వసంతరాయపురంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుండి వెలగపూడికి అసెంబ్లీ ఫర్నిచర్ తరలిస్తుండగా సర్దుబాటు చేసుకునే క్రమంలో కొంత ఫర్నిచర్‌ను తన కార్యాలయానికి తరలించామన్నారు. ఈ ఫర్నిచర్‌ను తీసుకెళ్లాలని అసెంబ్లీ అధికారులకు గతంలోనే రెండు లేఖలు రాశామన్నారు. అధికారులు ఫర్నిచర్ తీసుకెళ్లాలని లేని పక్షంలో విలువ ఎంతో చెబితే చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. నాపై, నా కుటుంబంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రతి అంశంపైనా రాజకీయంగా బురద జల్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఇచ్చే మందులు, సెల్‌ఫోన్‌లు కూడా విక్రయించి సొమ్ము చేసుకున్నామని ఆరోపించడం బాధాకరమన్నారు. తాను స్పీకర్‌గా ఉన్నప్పుడు అన్ని పార్టీల సభ్యులను సమాన దృష్టితో చూశామని, అసెంబ్లీకి రాకపోయినా జీతాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఐదు కోట్ల మంది ప్రజానీకం పరిపాలించేందుకు వైకాపాకు అధికారం ఇస్తే అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం, రివర్స్ టెండరింగ్, ఇసుక కొరత వంటి అంశాలతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారుస్తున్నారన్నారు. దేశంలోనే అద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మించాలని గత ప్రభుత్వం కృషిచేస్తే, వైసీపీ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసి శ్మశానంలా మార్చేందుకు ప్రయత్నిస్తుందని కోడెల మండిపడ్డారు.