ఆంధ్రప్రదేశ్‌

మహిళా కమిషన్ మగ వారికి వ్యతిరేకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 22: మహిళా కమిషన్ మగవారికి వ్యతిరేకం కాదని, మహిళలకు సంబంధించిన అంశాలపై మాట్లాడటానికి, పని చేయడానికి ప్రత్యేకించి ప్రభుత్వానికి సహకరించడానికే మహిళా కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్‌లో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా తనను నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవికి క్యాబినెట్ హోదా ఉంటే మరింత పకడ్బందీగా పని చేయడానికి అవకాశం ఉంటుందని భావించి క్యాబినెట్ హోదా ఇవ్వడం మహిళలందరికీ గర్వకారణమన్నారు. మద్యాన్ని దశలవారీగా నియంత్రించాలని, మద్యపాన నిషేధం వైపు అడుగులు వేయాలనే నిర్ణయం మహిళల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువచ్చి మంచి బాటకు అడుగులు వేస్తుందన్నారు. మహిళలకు సంబంధించి నేరం జరిగాక మాత్రమే మహిళా కమిషన్ మాట్లాడుతుందనే పరిస్థితి పోవాలన్నారు. అసలు నేరమే జరగకుండా మహిళా కమిషన్ కొన్ని ముందస్తు చర్యలు తీసుకోగలిగిందనే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావాలనేది తమ కోరిక అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మహిళలపై నేరాల్లో అగ్రస్థానంలో ఉండటం బాధాకరమన్నారు. కచ్చితంగా దీనిపై అధ్యయనం చేయాలన్నారు. అదే విధంగా మహిళలకు సంబంధించి ఆర్థికంగా వారు స్వశక్తిపై నిలబడే ప్రయత్నం ఇంకా ఎంత బాగా చేయగలమనే దిశగా ఆలోచన చేయాల్సి ఉందన్నారు. సున్నా వడ్డీలకు రుణాలు, డ్వాక్రా గ్రూపులు అప్పులు కట్టవద్దు అని చెప్పటంతో డ్వాక్రా గ్రూపుల వ్యవస్థ దెబ్బతిన్నదన్నారు. ఆన్‌లైన్ ఫిర్యాదులు సహా ఎక్కడ ఏ రకంగా ఫిర్యాదు ఇచ్చినా సరే దానిపై చర్య తీసుకునే విధంగా మహిళా కమిషన్‌ను తీర్చిదిద్దుతామని పద్మ అన్నారు.