ఆంధ్రప్రదేశ్‌

పారిశ్రామిక శే్వతపత్రంలో మా పారదర్శకత సుస్పష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 22: తాజాగా రాష్ట్ర పారిశ్రామిక విధానంపై ప్రభుత్వం విడుదల చేసిన శే్వతపత్రం చూస్తే తమ ప్రభుత్వ హయాంలోని పారదర్శకత సుస్పష్టమవుతోందని, ఆ విషయాన్ని నేరుగా ప్రభుత్వమే అంగీకరించినందుకు కృతజ్ఞతలు చెబుతున్నామని తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, పోలవరం టెండర్లపై హైకోర్టు తీర్పు, వరదలు, రాజధానిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తదితర అంశాలపై పార్టీ ముఖ్యనేతలతో గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 47 పేజీల శే్వతపత్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని ఎక్కడా చెప్పలేక పోయారన్నారు. దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వ పారదర్శక పాలన గురించి ఇట్టే అర్థమవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల్లోనే 31 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చేసినట్లు శే్వతపత్రంలో చూపించారని, వాటి జాబితా, ఫొటోలు ఇచ్చి పేర్లు చెబితే వెతుక్కుంటూ వెళతామని ఎద్దేవాచేశారు. మాకు తెలిసి ఈ రెండు నెలల కాలంలో కనీసం కోటి రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి నెలకొందన్నారు. రూ. 28,628 కోట్ల పెట్టుబడులతో 8 కంపెనీలను రద్దు చేసినట్లు శే్వతపత్రంలో మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొనడం దారుణమన్నారు. అల్ట్రాటెక్ సిమెంటు కంపెనీ, ఎస్‌ఎల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పెట్టుబడి రూ.24,900 కోట్లుగా ఉంటే, ఒక్క ఎస్‌ఎల్ పెట్టుబడే 23,400 కోట్లు అని, ఈ రెండు కంపెనీలు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న కారణంగా ఆ ప్రాజెక్టులు ముందుకు వెళ్లలేదని వివరించారు. వైసీపీ ప్రభుత్వ అంచనాలు బాహుబలి, సైరా అంచనాలను మించిపోతున్నాయన్నారు. క్విడ్‌ప్రోకో విధానమే వైసీపీ కొత్త పారిశ్రామిక విధానమా అంటూ ఆయన నిలదీశారు. కియా కార్ల పరిశ్రమతో ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌సిపిఎ) ఒప్పందం చేసుకున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. దీని ప్రకారం ఏ విధమైన లంచాలు తీసుకున్నా ప్రాసిక్యూట్ చేస్తారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ పారదర్శకతకు ఈ ఒప్పందమే అద్దం పడుతుందన్నారు. వైసీపీ నేతల ఆగడాల వలన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, ఇటుకపై ఇటుక పేర్చి తాము నిర్మిస్తే వైసీపీ నేతలు కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వరదల ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన సహాయక చర్యల్లో నిర్లక్ష్యాన్ని చంద్రబాబు ఖండించారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కృష్ణానది వరద బీభత్సంపై మహారాష్ట్ర ప్రభుత్వం ముందే కర్ణాటకను హెచ్చరించిందని, కర్ణాటక మన రాష్ట్రానికి వరద ముప్పు ఉందని తెలియజేసిందని తెలిపారు. వెంటనే మేల్కొని ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఇంత ఉపద్రవం సంభవించేది కాదని స్పష్టంచేశారు. గతంలో ఏనాడూ లేనివిధంగా శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఐదు రోజల్లోనే 51 అడుగుల నీటిమట్టం పెరిగిందని, ఆగస్టు 1వ తేదీన 809 అడుగులు ఉంటే 5వ తేదీ నాటికి 860 అడుగులకు పెరిగిందని తెలిపారు. 10వ తేదీకి 882.5 అడుగులకు చేరిందన్నారు. తొలిరోజు నుంచే ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో సక్రమంగా నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదని తెలిపారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి, మల్యాల నుంచి 47 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ జిల్లాలకు పంపించే అవకాశం ఉన్నా, వీటిలో సగం కూడా పంపకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వరద ఈ స్థాయిలో రావడానికి కేవలం మానవ తప్పిదమే కారణమని బాబు ఉద్ఘాటించారు. ఈ నష్టానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కేవలం ఒక్క ఉద్యాన రైతులకే రూ.3 వేల కోట్లు నష్టం జరిగిందని తెలిపారు. బాధితులకు పూర్తి పరిహారం చెల్లించాలని, ఇళ్లు దెబ్బతిన్న వారికి వెంటనే గృహనిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నేతలు, పార్టీ శ్రేణులు వరద సహాయక చర్యల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ భేటీలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, నారా లోకేష్, అశోక్‌బాబు, టిడి జనార్ధన్, బుద్ధా వెంకన్న, వివివి చౌదరి, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, నేతలు జీవీ ఆంజనేయులు, వర్ల రామయ్య, పంచుమర్తి అనూరాధ, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... టీడీపీ ముఖ్యనేతల భేటీలో మాట్లాడుతున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు