ఆంధ్రప్రదేశ్‌

జైట్లీ మృతి పట్ల సీఎం, గవర్నర్ సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 24: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, తదితర ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో ప్రగాఢ సంతాపం తెలిపారు. జైట్లీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని గవర్నర్ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలంటూ సందేశం పంపారు. నాలుగు దశాబ్దాలుగా నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ రాజకీయాల్లో సముచిత స్థానం దక్కించుకున్న జైట్లీ మరణం దిగ్భ్రాంతి పరచిందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థస్తున్నానన్నారు.
చంద్రబాబు సంతాపం
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జైట్లీ కోలుకుంటారని ఆశిస్తున్న అరుణంలో అందరికీ దూరం కావటం దురదృష్టకరమన్నారు. వివిధ హోదాల్లో ఆయన దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన మృతి ఒక్క బీజేపీకే కాకుండా మొత్తం దేశానికి తీరని లోటన్నారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైట్లీ మృతి దేశానికి తీరనిలోటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు. న్యాయకోవిదునిగా, పరిపాలనాదక్షునిగా దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివన్నారు. సీనియన్ నేత అరుణ్ జైట్లీ మరణం బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. వేర్వేరు హోదాల్లో ఆయన ఆర్థిక, న్యాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టారని, ఎమర్జన్సీ సమయంలో 19మాసాలు జైలు జీవితం గడిపిన జైట్లీలో సంస్కరణాభిలాష మెండుగా కనిపించేదని పేర్కొన్నారు. జైట్లీ మృతి పట్ల విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఓ ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు. పలు రంగాల్లో జైట్లీ తెచ్చిన సంస్కరణలు అన్ని వర్గాలు, అన్ని పక్షాలను సంతృప్తిపరిచాయని పేర్కొన్నారు. జైట్లీ మృతి పట్ల రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలంటూ సానుభూతి తెలిపారు.
ఢిల్లీకి కన్నా, రాంమాధవ్
అరుణ్ జైట్లీ మృతితో తిరుపతి పర్యటనలో ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెంటనే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.