ఆంధ్రప్రదేశ్‌

తొక్కిసలాటపై మళ్లీ మొదలైన విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 20: గోదావరి నది పుష్కరాల తొలి రోజు పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం వేసిన కమిషన్ విచారణ మళ్లీ మొదలైంది. కమిషన్ జస్టిస్ సివై సోమయాజులు శనివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విచారణ నిర్వహించారు. ఘటనకు సంబంధించి సాక్ష్యాధారాల నివేదికలను ప్రభుత్వ యంత్రాంగం ఎట్టకేలకు కమిషన్‌కు సమర్పించింది. విచారణ తేదీకి ఒక రోజు ముందు అంటే 19వ తేదీన అధికారులు కమిషన్‌కు నివేదికలు సమర్పించారు. ఇందుకు సంబంధించి నివేదిక ప్రతులను బాధితుల తరపున్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావుకు ఇచ్చేందుకు కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ముప్పాళ్ల సుబ్బారావు కమిషన్‌కు మెమో సమర్పించారు. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ రూపొందించిన డాక్యుమెంట్ సిడిని కూడా ఇవ్వాల్సిందిగా ముప్పాళ్ల విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తరపున న్యాయవాది ప్రభాకర్ స్పందిస్తూ డాక్యుమెంట్ రూపొందించిన ఛానల్ ఇంకా బయటకు ప్రసారం చేయలేదు కాబట్టి బహిర్గతం చేయడం సమంజసం కాదని అన్నారు. మొత్తం మీద ప్రభుత్వ యంత్రాంగం తొక్కిసలాట ఘటన జరిగినపుడు విధుల్లో ఉన్న అధికారులు, బారికేడ్లు నిర్మాణం, బందోబస్తు వివరాలు, పోలీసు అధికారులు, వైద్య సేవలు తదితర అంశాలకు సంబంధించి సుమారు 300 పేజీల నివేదికను కమిషన్‌కు సమర్పించినట్టు సమాచారం. అవసరమైన సాక్ష్యాధారాలకంటే అనవసర వివరాలనే అధికంగా అధికారులు ఈ నివేదికలో కమిషన్‌కు సమర్పించినట్టుగా తెలుస్తోందని న్యాయవాది ముప్పాళ్ళ మీడియాతో అన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం, వైద్య సేవలు, సంఘటన జరిగిన పుష్కర ఘాట్ వద్ద బారికేడింగ్ తదితర అంశాలపై ఇటు వైద్య శాఖాపరంగానూ, అటు రోడ్లు భవనాల శాఖ ద్వారాను సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన విషయాన్ని కమిషన్‌కు సమర్పించినట్టు తెలిపారు. కమిషన్ విచారణ తదుపరి విచారణ సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి గత జూన్ 29వ తేదీతో కమిషన్ విచారణ గడువు పూర్తయింది. ప్రభుత్వం మళ్లీ ఈ విచారణ కమిషన్‌ను మూడో సారిగా మరో మూడు నెలల పాటు సెప్టెంబర్ 29వ తేదీ వరకు పొడిగింది. కమిషన్ విచారణ పొడిగింపునకు విడుదల చేసిన జీవోను ఆగస్టు 4వ తేదీన వెల్లడించింది. అంటే గడువు పొడిగించిన దాదాపు నెల రోజులకు కమిషన్ గడువు పెంచిన విషయాన్ని వెల్లడించడం, ఆ తర్వాత నెల మాత్రమే విచారణకు గడువు వుండటం చూస్తుంటే ప్రభుత్వానికి పుష్కర ఘాట్ తొక్కిసలాట ఘటనపై ఎంత చిత్తశుద్ధి వుందో అర్ధం చేసుకోవచ్చని విచారణకు హాజరైన సిపిఎం అర్బన్ జిల్లా కార్యదర్శి టి. అరుణ్ అన్నారు. కలెక్టర్‌ను విచారణ చేయాల్సి వుందని ముప్పాళ్ల చెప్పారు. తొక్కిసలాట జరిగిన పుష్కర ఘాట్ గేట్ 1 వరకు బారికేడ్లు ఉన్నాయని ఆర్ అండ్ బి అధికారులు ఇచ్చిన నివేదికలో వుందని, అయితే ఎవరి ఆదేశాల మేరకు తొలగించారో తెలియజేయాల్సి వుందని ముప్పాళ్ల పేర్కొన్నారు. అధికారుల వివరాలు పొంతనలేకుండా వున్నాయని ఆరోపించారు.