ఆంధ్రప్రదేశ్‌

కార్మిక హక్కులపై దాడులు సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 25: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో మెజార్టీని అడ్డం పెట్టుకుని లేబర్ కోడ్‌ల పేరిట కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించాలని ప్రయత్నిస్తే సహించేది లేదని, జాతీయ స్థాయిలో ప్రభుత్వ విధానాలపై ఐక్యంగా ఉద్యమిస్తామని ఏఐటీయుసీ జాతీయ ఉపాధ్యక్షుడు టీ నరశింహన్ హెచ్చరించారు. ఆదివారం ఉదయం నగరంలోని ఏఐటీయుసీ రాష్ట్ర కార్యాలయం జోశ్యభట్ల సత్యనారాయణ భవన్‌లో ఏఐసీబీసీడబ్ల్యూ అధ్యక్షుడు విజయన్ కునిసేరి అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మిక వర్గంపై దాడి తీవ్రతరం చేసిందని, కార్మిక చట్టాల స్థానంలో కోడ్‌లను ప్రవేశపెడుతూ కార్మికవర్గం అనుభవిస్తున్న హక్కులకు రద్దుచేస్తున్నారని నరశింహన్ విమర్శించారు. కనీస వేతనం రూ. 21వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి రూ. 18వేలు మాత్రమే ప్రకటించడం దారుణమన్నారు. నరేంద్ర మోదీ పాలనలో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోందని, ఆటోమొబైల్ రంగం సహా వేలాది సంస్థలు మూతపడుతున్నాయని, కొన్ని లక్షల మంది కార్మికులు ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ఒకేరోజు 36 ప్రజావ్యతిరేక బిల్లులను ఆమోదింపజేసుకోవడంలో మోదీ రాజకీయ చతురత ప్రదర్శించారన్నారు. ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ఓబులేసు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, 50లక్షల మంది కార్మికులు పనులు లేక అల్లాడుతున్నారన్నారు. ఇసుక కృత్రిక కొరతను ప్రభుత్వం సృష్టించి రాష్ట్భ్రావృద్ధిని కుంటుపరుస్తోందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కే రవి నివేదికను సమర్పిస్తూ దేశంలో ఆర్థిక, నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. భవిష్యత్ పోరాటాలకు కార్మికులను సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐటీయుసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చలసాని వెంకట రామారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు వీ రాధాకృష్ణమూర్తి, అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుండి యు రత్నాకరరావు, నారాయణ పుర్‌బే, కమలాసిన్, బండ్‌మిత్రో, చంద్రశేఖరన్, సెల్వరాజ్, శివన్న, ప్రవీణ్‌కుమార్ సహా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పల్లా సూర్యారావు, ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.
చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు నరసింహన్