ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: నాగార్జునసాగర్ గేట్ల ఎత్తివేతతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతానికి మొత్తం 70 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలుతూ 16వేల క్యూసెక్కుల నీటిని కాలువలకు వదలుతున్నారు. ప్రస్తుతం పులిచింతల నుంచి దాదాపు 4లక్షల క్యూసెక్కుల నీటిని వదలుతుండటంతో ఈ నీరు బుధవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీకి చేరనుంది. కృష్ణా కలెక్టర్ ఎఎండీ ఇంతియాజ్ కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇటు అధికారులను అటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద తీవ్రత వల్ల ఇసుక రీచ్‌లన్ని మునిగే ప్రమాదం ఉండటంతో ఇసుక నిల్వలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయినప్పటికీ ఇసుక కోసం ఆన్‌లైన్‌లో నమోదు చసుకున్న వారికి ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇంతవరకు 1300 క్యూబిక్ మీటర్ల ఇసుకను సరఫరా చేయగా మరో వెయ్యి క్యూబిక్ మీటర్లు స్టాక్ పాయింట్లలో నిల్వ ఉందన్నారు.
చిత్రం... ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు విడుదలవుతున్న వరద నీరు