ఆంధ్రప్రదేశ్‌

వినుకొండ విద్యాసంస్థలపై సమగ్ర విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: వినుకొండలో శ్రీ వివేకానంద విద్యాసంస్థలు పేరుతో నిర్వహిస్తున్న దాదాపు పాతిక విద్యాసంస్థల లోగుట్టుపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఎన్‌సిఇఆర్‌టిని హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది. ఎలాంటి అనుమతి లేకుండా అనేక అక్రమాలతో ఈ విద్యాసంస్థలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ ప్రకాశం జిల్లాకు చెందిన నవులూరి మాధవరావు దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. ఇందుకోసం ఒక గెజిటెడ్ అధికారిని విద్యాసంస్థల తనిఖీకి పంపించాలని కూడా న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు. శ్రీ వివేకానంద విద్యాసంస్థల సొసైటీ ఆధీనంలో బిఇడి, డిఇడి, హిందీ పండిట్, తెలుగు పండిట్ కోర్సులను నిర్వహిస్తున్నారని, వీటికి ఎలాంటి అనుమతి లేదని పిటీషనర్ వివరించారు. సిఐడి, విజిలెన్స్ అధికారులు, ఎసిబి అధికారులు సైతం ఈ విద్యాసంస్థలపై దాడులు నిర్వహించారని, సయ్యద్ రఫీక్ అనే వ్యక్తి వీటిని నిర్వహిస్తున్నారని, ఎసిబి దాడి సందర్భంగా 44.65 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని ఐదు కాలేజీల పర్మిషన్ తీసుకుని 21 కాలేజీలు నిర్వహిస్తున్నట్టు ఆయా సంస్థలు నివేదించాయని పేర్కొన్నారు. ఈనెల 31లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తి సంబంధిత అధికారులను ఆదేశించారు.