ఆంధ్రప్రదేశ్‌

సచివాలయానికి మంత్రుల క్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 27: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పేషీల ప్రారంభోత్సవానికి మంత్రులు క్యూకడుతున్నారు. ఇప్పటి వరకు గృహనిర్మాణం, పంచాయతీరాజ్, రవాణా, ఆర్థిక, మున్సిపల్, వైద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమం, అటవీశాఖల కార్యాలయాల తరలింపు పూర్తయింది. శనివారం సెలవురోజయినప్పటికీ ముహూర్తం ప్రకారం మంచిరోజు కావడంతో వ్యవసాయశాఖ కార్యాలయాన్ని, పేషీని సంబంధిత శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలసి ప్రారంభించారు. నాలుగో బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉదయం 8.39 గంటలకు తన పేషీలో ఆసీనులయ్యారు. కాగా సోమవారం ఉదయం 9.09 గంటలకు ఉన్నత విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు నాలుగోబ్లాక్ మొదటి అంతస్తులో తన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తరలింపు ప్రక్రియ వేగవంతమైనప్పటికీ మంత్రులు తమ రాజకీయ భవిష్యత్‌కు అనుగుణంగా ముహూర్తాలను నిర్ణయించుకుని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. కొత్త సచివాలయంలో వసతులపై మంత్రుల్లోనూ ఒకింత అసంతృప్తి చోటుచేసుకున్నప్పటికీ తప్పని సరి కావడంతో వాస్తుకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యవసాయశాఖ కార్యాలయానికి త్వరలోనే ఫైళ్లను తరలించి అందుబాటులోకి తెస్తామని పుల్లారావు తెలిపారు. పవన్‌కల్యాణ్ సభపై ఆయన స్పందిస్తూ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడితెచ్చే క్రమంలోనే పవన్ కల్యాణ్ స్పందించారని తెలిపారు. హోదా సాధనకుచంద్రబాబు ఢిల్లీలో ప్రధానమంత్రి, కేంద్రమంత్రులతో మంతనాలు జరుపుతున్నారని వివరించారు.

చిత్రం.. వ్యవసాయ కార్యాలయంలో మంత్రి పుల్లారావు