ఆంధ్రప్రదేశ్‌

కౌలురైతుల గుర్తింపునకు కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద కౌలు రైతులను గుర్తించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కౌలు రైతులకు కిసాన్ సమ్మాన్‌ను కేంద్రం వర్తింపజేయక పోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. కేంద్రం అందించే 6వేల రూపాయలను కలుపుకుని ఈ పథకాన్ని రైతులకు వర్తింపజేయనుంది. దాదాపు 64లక్షల మంది రైతులకు ఈ పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు వీలుగా బడ్జెట్‌లో 8750 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ పథకాన్ని అక్టోబర్ 15నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం ఇచ్చే సాయం మినహాయించగా, మరో 6500 రూపాయలు రాష్ట్రం చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం ఒక విడత కింద 2వేల రూపాయలను ఏప్రిల్‌లో చెల్లించింది. ఇక కౌలురైతులకు కేంద్రం ఆర్థిక సాయం అందించడం లేదు.
దీంతో కౌలురైతులను గుర్తించే పనిలో అధికారులు బిజీ అయ్యారు. అసలు భూమి లేకుండా కౌలుకు తీసుకుని సాగుచేస్తున్న వారికి మాత్రమే రైతు భరోసా వర్తింపజేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ఈ నెల 9 నుంచి సర్వే ప్రారంభించారు. సొంతంగా భూమి లేకుండా కేవలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న వారికే రైతు భరోసా అందించనున్నారు. కొంత భూమి ఉండి, మరికొంత భూమిని కౌలుకు తీసుకున్న వారికి ఈ పథకం వర్తించదు. కుటుంబంలో ఒక్కరికే ఈ సాయం అందిస్తారు. రాష్ట్రంలో దాదాపు 12లక్షల మంది కౌలురైతులు ఉంటారని అధికారులు ఓ అంచనాకు వచ్చారు.