ఆంధ్రప్రదేశ్‌

నన్ను తీసుకుపోతే బాగుండేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంపచోడవరం, సెప్టెంబర్ 15: కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో అప్పటివరకు ఆనందంగా విహారయాత్రలో పాల్గొన్న వారంతా నిముషాల వ్యవధిలో తమ ఆప్తులను కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద ఆదివారం బోటు ప్రమాదం నుండి బయటపడిన వారంతా, తమ వారిని కోల్పోయిన విషాదంలో మునిగిపోయారు. విహారయాత్ర కావడంతో దాదాపు పాల్గొన్న వారంతా ఆప్తులతో బృందాలుగా వచ్చిన వారే. దీనితో బయటపడిన వారిలో అంతా ఎవరో ఒకరిని కోల్పోయిన వారే కావడంతో వారి ఆవేదనకు అంతులేదు. భర్త, కుమార్తె గల్లంతవ్వడంతో ప్రమాదం నుండి బయటపడిన తిరుపతికి చెందిన మధులత అనే మహిళ విలపిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. ‘నేను ఏం పాపం చేశాను దేవుడా... నా భర్తను, బిడ్డను తీసుకుపోతున్నావు... నేను చనిపోయినా బాగుండేది’ అంటూ రంపచోడవరం ఆసుపత్రిలో ఆమె విలపిస్తోంది. పరామర్శించడానికి వచ్చిన మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబుతో ఆమె మాట్లాడుతూ ప్రమాద సమయంలో తన భర్త తనను పైకి తోసేసి, తాను నీటిలో మునిగిపోయాడని, తన బిడ్డ తన కాళ్లనే పట్టుకునివుందని, కాపాడుకోలేకపోయానని వాపోయింది. ఆమె హృదయ విదారక రోదనతో మంత్రులు సైతం మ్రాన్పడిపోయారు. ఇక హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన జానకిరామయ్యది మరో విషాదం. భార్య, బావమరిది, బావమరిది భార్య, కుమారులతో ఈయాత్రలో ఆయన పాల్గొన్నారు. జానకిరామయ్య ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడి, రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన వారు నలుగురి ఆచూకీ తెలియడంలేదని ఆయన రోదిస్తున్నారు. ఇలా బాధితుల రోదనలతో రంపచోడవరం ఆసుపత్రి మార్మోగింది.

*చిత్రాలు.. భర్త, బిడ్డను కోల్పోయి విలపిస్తున్న మధులత
*భార్య సహా నలుగురు ఆప్తులను కోల్పోయిన జానకిరామయ్య