ఆంధ్రప్రదేశ్‌

స్విస్ చాలెంజ్‌తో ఖజానా ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: చంద్రబాబు మంకుపట్టును వీడి అమరావతి రాజధాని నిర్మాణంలో అమలు చేయనున్న స్విస్‌చాలెంజ్ పద్ధతిని వదులుకోవాలని పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్, వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విదేశీ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెట్టే ధోరణిని మానుకోవాలన్నారు. అమరావతి డెవలప్‌మెంట్ ప్రాజెక్టుతో రాష్ట్రానికి హాని జరుగుతుందన్నారు. సింగపూర్ కన్సార్టియం కేవలం భూముల వ్యాపారం చేస్తుందన్నారు. దీని వల్ల రాష్ట్ర ఖజనా ఖాళీ అవుతుందని, ప్రజలపై భారం పడుతుందన్నారు. మన దేశ చట్టాల్లో ఎక్కడా లేని విధంగా ఒక రాజధాని కట్టడాల నిర్మాణానికి విదేశీ కంపెనీలతో చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకోవడం, దీనిపై వివరాలను గోప్యంగా ఉంచడం తగదన్నారు. సుప్రీం కోర్టు కూడా స్విస్ చాలెంజ్ విధానాన్ని తప్పుబట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టులో పెట్టేందుకు చంద్రబాబు చేస్తున్న కుయుక్తులను తిప్పిగొడుతామని ఆయన హెచ్చరించారు.