ఆంధ్రప్రదేశ్‌

సింగపూర్ జపం మానుకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాలకు పాల్పడుతున్నారని, సింగపూర్ జపం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ హితవుచెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములను బలవంతంగా సేకరించడం, స్విస్‌చాలెంజ్ పద్ధతిపై తాను చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. తన సవాలును స్వీకరించి మంచి వాతావరణంలో చర్చకు రావాలని ఆయన టిడిపి నేతలను కోరారు. శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన ‘ భ్రమరావతి’ పేరుతో బుక్‌లెట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ ఈ పుస్తకం చదివితే ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి కాదని ఒక భ్రమరావతిగా ఆవిష్కారమవుతుందన్నారు. సింగపూర్ గొప్ప దేశం కాదని, ఆ దేశంలో అవినీతి ఉండదేమో కాని, ఇతర దేశాలకు చెందిన సంపన్నులు నల్లధనం సింగపూర్‌లో దాచుకుంటారన్నారు. సింగపూర్ ప్రజాస్వామ్య దేశం కాదని, కుటుంబ పాలన, నిరంకుశత్వం నడుస్తోందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం నిమిత్తం స్విస్ చాలెంజ్ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించడం తగదన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చంద్రబాబు నడుచుకుంటున్నారన్నారు. హైదరాబాద్‌లో సగం ఉండని సింగపూర్ గురించి అభూతకల్పనలు సృష్టించి చంద్రబాబు ప్రజలను తప్పుదోవబట్టిస్తున్నారన్నారు.
అమరావతి కోసం 35వేల ఎకరాలు తీసుకుని ఏమి చేస్తారన్నరు. ఒక రాజధాని నిర్మాణానికి 1500 ఏకరాలు సరిపోతుందని శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సు చేస్తే బుట్టదాఖలు చేశారన్నారు. హైదరాబాద్‌లో అన్ని రకాల పాలనా భవనాలు కేవలం రెండు వేల ఎకరాల్లో ఉన్నాయన్నారు. బ్రెజిల్ ఆర్ధిక అక్రమాలకు పాల్పడిన సెంబ్‌కార్ప్, అసెండాస్ కంపెనీలు అమరావతి నిర్మాణానికి ఆహ్వానించడం విచారకరమన్నారు. అమరావతి భూముల సేకరణపైదర్యాప్తు జరగాలన్నారు. చంద్రబాబును విమర్శిస్తే టిడిపి నేతలు విరుచుకుపడుతున్నారని, ఈ ధోరణిని మానుకోవాలన్నారు. టిడిపి సీనియర్ నేతలు వాస్తవాలను గుర్తించి మసులుకోకపోతే, ఆంధ్రరాష్ట్రం ఎక్కువగా నష్టపోతుందన్నారు. అమరావతి రాజధాని కోసం మంత్రి నారాయణ, గల్లా జయదేవ్, సుజనా చౌదరి, జివికె రెడ్డి, జిఎంఆర్ మల్లిఖార్జునరావు, నూజివీడు సీడ్స్ ప్రభాకరరావుతో నియమించిన కమిటీ ఏమైందని, ఈ కమిటీ నివేదిక ఇచ్చిందా అని ఉండవల్లి నిలదీశారు. రియల్ ఎస్టేట్ రాజధానిగా అమరావతిని చేయడం దారుణమని, ఇప్పటికైనా టిడిపి నేతలు, మంత్రులు కళ్లు తెరిచి రాష్ట్రాన్ని రాజధాని పేరుతో దివాళా తీయించరాదని కోరారు.
చివరి అంకంలో ఉద్యోగుల విభజన
సమస్యాత్మక అంశాలపై రేపు కమలనాథన్ కమిటీ భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల కేటాయింపులపై కమలనాథన్ కమిటీ నేతృత్వంలో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర సచివాలయానికి సంబంధించి సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులతో పాటు వైద్య ఆరోగ్య రంగానికి చెందిన ఉద్యోగుల కేటాయింపుల అంశాలను చర్చిస్తారని సంబంధిత ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. శనివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఇప్పటికే అన్ని శాఖలకు చెందిన ఉద్యోగుల విభజన జరిగిపోయిందని, సమస్యాత్మక అంశాలుగా మిగిలిపోయిన కొన్ని శాఖలపైనే సోమవారం జరిగే సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. ఉద్యోగుల విభజనకు సంబంధించి బహూశా ఇదే చివరి సమావేశం కావచ్చని అభిప్రాయపడ్డారు.