ఆంధ్రప్రదేశ్‌

అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి ఆంధ్రాబ్యాంక్ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: అగ్రి గోల్డ్ ఆస్తులపై హైకోర్టు పర్యవేక్షిస్తుండగా, కొన్ని బ్యాంకులు ఈ సంస్థ ఆస్తుల వేలానికి చర్యలు తీసుకుంటున్నాయంటూ ఆంధ్ర సిఐడి అధికారులు శనివారం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సిఐడి తరఫున న్యాయవాది కృష్ణ ప్రసాద్ హైకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఆంధ్రాబ్యాంకు అగ్రి గోల్డ్ ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేసిందన్నారు. ఆంధ్రాబ్యాంకు యాజమాన్యం తమ వద్ద అగ్రిగోల్డ్ తాకట్టుపెట్టిన ఆస్తుల వివరాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సిఐడి న్యాయవాది కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ కేసులో తాము చార్జిషీటు దాఖలు చేశామని, పది కోట్ల నగదు, 2500 ఎకరాల భూమి ఉన్నట్లు కనుగొన్నామని ఆయన తెలిపారు. షోలాపూర్‌లో ఈ సంస్థకు చెందిన 45 ఎకరాలను తెలంగాణ సిఐడి జప్తు చేసిందని చెప్పారు. కాగా హైకోర్టు నియమించిన ముగ్గురు కమిటీ సభ్యుల వ్యయాన్ని భరించేందుకు వీలుగా అగ్రిగోల్డ్ పది లక్షల రూపాయల చెక్‌ను హైకోర్టుకు సమర్పించింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేశారు.