ఆంధ్రప్రదేశ్‌

నేడు గవర్నర్‌ను కలవనున్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కలిసి ఫిర్యాదు చేయనున్నారు. గత మూడు రోజులుగా కోడెల ఆత్మహత్యపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్న విషయం తెలిసిందే. వైకాపా ప్రభుత్వం వేధింపుల వల్లనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అనంతరం చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. కోడెల ఆత్మహత్య ఘటనపై విచారణకు ఆదేశించాలని కోరనున్నారు. అదే విధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. కోడెల మృతితో పార్టీ కేడర్‌లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించేందుకు పార్టీ నేతలందరూ చంద్రబాబు నివాసంలో సమావేశమై రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిసింది. గురువారం చంద్రబాబు నివాసంలో జరిగే భేటీలో పార్టీ ముఖ్య నేతలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు హాజయ్యే అవకాశముంది.