ఆంధ్రప్రదేశ్‌

ఆశల పల్లకిలో ఆశావహులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగంగానే సంకేతాలివ్వడంతో తెలుగుదేశం పార్టీ ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయంటూ తాజాగా ముఖ్యమంత్రి ఇచ్చిన సంకేతాలతో సీనియర్లతోపాటు, కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు కూడా పదవులపై ఆశలు పెట్టుకున్నారు.జగన్‌కు అనుకూలత లేకపోయినా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని భావిస్తున్న బాబు, ఎన్నికల్లోగా విపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనే వారితోపాటు కార్యకర్తలను దన్నుగా నిలిచే నేతల అవసరం ఉందని గుర్తించినట్లు చెబుతున్నారు.
అయితే అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు మంత్రిపదవి ఇస్తారా లేదా అనే దానిపై పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కోడెలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ బలంగా ఉండేదని, ఎప్పుడైతే ఆయన ప్రాధాన్యం తగ్గించారో అప్పుడే ఆ జిల్లాల్లో ఆయనతో సహా పార్టీ ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే ఆయనకు కీలకమైన శాఖలు ఇస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే, కోడెల సన్నిహితులు మాత్రం ఆయన క్యాబినెట్‌లో చేరబోరని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పదవిలో ఆయన సౌకర్యంగానే ఉన్నారని, పైగా క్యాబినెట్‌లో చాలామంది జూనియర్లు ఉండటంతో ఆయన స్థాయి, అనుభవం దృష్ట్యా వారితో కలసి పనిచేయడం ఇబ్బందికరమేనంటున్నారు.
కాగా, మంత్రి నారాయణను తప్పించవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు సిఆర్‌డిఏ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఏ చైర్మన్‌గా ఉన్నారు. మంత్రి పదవినుంచి తప్పించినప్పటికీ, ఈ పదవి ఇవ్వడం ద్వారా ఆయనను సంతృప్తి పరచనున్నట్లు చెబుతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిశోర్‌బాబు, పుల్లారావు ఇద్దరినీ తప్పించవచ్చంటున్నారు. రావెల విఫలమయ్యారన్న విమర్శలతోపాటు, పుల్లారావు కుటుంబసభ్యులపై ఆరోపణలు వారి తొలగింపునకు కారణం కావచ్చంటున్నారు. పుల్లారావు స్థానంలో కమ్మ వర్గం నుంచి ధూళిపాళ్ల నరేంద్రకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి శిద్దారాఘవరావుకు స్థానభ్రంశం తప్పకపోవచ్చని, ఆయన పార్టీకి విధేయుడు, నిజాయితీపరుడన్న పేరున్నప్పటికీ, ఆయనపై నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చినా దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారంటున్నారు. శిద్దా స్థానంలో జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డికి అవకాశం లభించే అవకాశం ఉందంటున్నారు. అయితే పక్కనే ఉన్న నెల్లూరు జిల్లానుంచి సీనియర్ నేత సోమిరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి మృణాళిని తప్పించడం ఖాయమని, పీతల సుజాతను కొనసాగించినా ఆమె ప్రాధాన్యం తగ్గించవచ్చంటున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రాధాన్యం తగ్గించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. హోంమంత్రి చినరాజప్ప శాఖ మార్చవచ్చంటున్నారు. రావెల స్థానంలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అనంతపురంనుంచి పయ్యావుల కేశవ్‌కు స్థానం కల్పించాలనుకుంటే పల్లె, పరిటాలలో ఒకరిని తప్పించాల్సి ఉంది. వైసీపీ నుంచి ఇటీవల పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ, సుజయ కృష్ణ రంగారావు, భూమా, చాంద్‌పాషాకు క్యాబినెట్ బెర్తులు ఖాయమంటున్నారు. జలీల్‌ఖాన్‌కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని, ఒకవేళ ఆ జిల్లా నుంచి అవకాశం లభిస్తే జగ్గయ్యపేట సీనియర్ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు వస్తుందంటున్నారు.