ఆంధ్రప్రదేశ్‌

గోదావరి పడవ ప్రమాదంపై విచారణ కమిటీ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: గోదావరి నదిలో కచ్చులూరు వద్ద జరిగిన పడవ ప్రమాదంపై విచారణకు కమిటీని రాష్ట్ర ప్రభుత్వం గురువారం నియమించింది. ఈ ఘటనపై విచారణ జరిపి, నివేదిక అందిచేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించటంతో ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. కమిటీ ఏర్పాటైన 21 రోజుల్లో నివేదికను, సిఫారసులను అందచేయాల్సి ఉంటుంది. కమిటీ చైర్మన్‌గా ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సభ్యులుగా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, అదనపు డీజీపీ, ఓడరేవుల సంచాలకుడు, కన్వీనర్‌గా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. పడవ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను ఈ కమిటీ పరిశీలిస్తుంది. బాధ్యులను గుర్తించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సూచనలు అందచేస్తుంది. లైసెన్సు లేని, ఫిట్‌నెస్ సరిగా లేని, రిజిస్టర్ కాని బోట్లను ఫెర్రీ పాయింట్ వద్దే నిలిపివేసేందుకు చర్యలను సూచిస్తుంది. ఫెర్రీ పాయింట్ల వద్ద కంట్రోల్‌రూమ్ ఏర్పాటు, బోటు డ్రైవర్లకు శిక్షణ, వరద సమయంలో బోట్ల అనుమతి తదితర అంశాలపై సిఫారసులను ఈ కమిటీ చేస్తుంది.