ఆంధ్రప్రదేశ్‌

ఏపికి కొత్త పురావస్తు శాఖ సర్కిల్‌ను ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా కొత్తగా పురావస్తు శాఖను ఏర్పాటు చేయాలని అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజన జరిగి మూడు సంవత్సరాలు గడచినా, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా పురావస్తు సర్కిల్‌ను ఏర్పాటు చేయలేదన్నారు. ఈ ఏడాది జూన్ 7వ తేదీన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక సర్కిల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కాని హైదరాబాద్‌లోని ప్రస్తుత ఉమ్మడి సర్కిల్ కార్యాలయాధికారి మాత్రం ఈ ఆదేశాలను అమలు చేయడంలేదన్నారు. ఈ ఆదేశాల ప్రకారం సిబ్బందిని, ఆస్తులను సర్దుబాటు చేయాలన్నారు. ఆంధ్రాలో 129 ప్రత్యేక ప్రదర్శన శాలలు, నాలుగు కేంద్ర పురావస్తు శాఖ మ్యూజియంలు, మూడు కోటలున్నాయన్నారు. విభజన చేస్తే తమ పెత్తనం పోతుందనే భయంతో కొత్త సర్కిల్ ఏర్పాటుకు మోకాలడ్డుతున్నారన్నారు. వచ్చే అక్టోబర్ 2 నాటికి కొత్తగా పురావస్తు సర్కిల్ ఏర్పాటు చేయాలన్నారు.