ఆంధ్రప్రదేశ్‌

పటిష్ఠంగా తెలుగు అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 29: రాష్ట్రంలో తెలుగు భాషా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పాలనలో పటిష్ఠంగా తెలుగుభాష అమలుకు నెలరోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తెలుగుభాషను ఉన్నత స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగు ప్రాచీన కేంద్రం ఏర్పాటుకు నాగార్జున యూనివర్సిటీలో స్థలాన్ని కేటాయిస్తామన్నారు. తెలుగు వారసత్వ సంపద ప్రజలకు తెలియచేయడానికి ఒక మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారసత్వ సంపదను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తామని తెలిపారు. తెలుగుభాషా పరిరక్షణ, వ్యాప్తికోసం అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని నియమిస్తామని, నెలరోజుల్లో ఈ కమిటీ నివేదిక అందజేస్తుందని చెప్పారు. తెలుగుభాష పరిరక్షణ బాధ్యత మనందరిదనీ, ఇది మన ఇంటి నుంచే మొదలుకావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆంగ్ల భాషను నేర్చుకోవలసిన అవసరం ఉన్నా, తెలుగుభాషను మరచిపోకూడదని చెప్పారు. తెలుగుభాష వైభవం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరిసేలా ప్రతి జిల్లాలో సంవత్సరానికి 100 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వివరించారు.

చిత్రం.. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి
పూలమాల వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్