ఆంధ్రప్రదేశ్‌

జయేంద్ర సరస్వతికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 30: కంచికామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతి స్వామి(82) హైబిపితో మంగళవారం ఉదయం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లగా పక్కనే ఉన్న ఆయన శిష్యులు, పీఠం సిబ్బంది హుటాహుటిన ఇక్కడి ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్య పరీక్షలు, వైద్య సేవలనంతరం ఆయనకు చికిత్సనందించిన డాక్టర్ రవిరాజు, డాక్టర్ పవన్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం స్వామీజీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పూర్తిగా కోలుకోటానికి మరో రెండు రోజులు సమయం పడుతుందన్నారు. స్వామీజీ వ్యక్తిగత గుండె, వైద్య, నరాల నిపుణులు సాయంత్రానికి చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. స్వామీజీ శరీరంలో పడిపోయిన సోడియం లెవల్స్‌ను పెంచేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించింది. ఆసుపత్రికి చేర్చిన వెంటనే స్వామీజీని వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స ప్రారంభించి అనంతరం బాడీ స్కానింగ్ నిర్వహించారు. స్వామీజీ శిష్యులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి వచ్చి ఆయన సత్వరం కోలుకోవాలంటూ ప్రార్థనలు చేశారు.
విజయవాడలో చాతుర్మాస్య దీక్ష నిర్వహిందుకు గాను జయేంద్ర సరస్వతి స్వామి, శ్రీవిజయేంద్ర సరస్వతి స్వామి తమ సిబ్బందితో జూలై 8వ తేదీ లబ్బీపేటలోని కంచికామకోటి పీఠం వారి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణానికి వచ్చారు. సెప్టెంబర్ 16 తేదీతో దీక్ష ముగియాల్సి ఉంది. కృష్ణా పుష్కరాలు ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో దుర్గాఘాట్‌లో ప్రత్యేక పూజలు, పుష్కర స్నానాలు చేయించారు. అనంతరం స్వామీజీ పుష్కర స్నానం ఆచరించారు. పుష్కరాల 12 రోజులు కూడా స్వామీజీ పవిత్ర స్నానాలు చేశారు. 2015 జూలై 14న గోదావరి పుష్కరాలు ప్రారంభం సందర్భంగా అక్కడ కూడా పుణ్యస్నానమాచరించారు. రెండేళ్ల క్రితం విగ్రహ ప్రతిష్ఠ కోసం నెల్లూరు వెళ్లినపుడు ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోగా అస్వస్థతకు గురికాగా తక్షణం ఆసుపత్రిలో చేర్పించి వైద్య సహాయమందించారు. మరోవైపు స్వామీజీ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరాతీసి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.