ఆంధ్రప్రదేశ్‌

నేడు మహిషాసురమర్దనిగా బెజవాడ దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 6: దసరా ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆశ్వయుజ శుద్ధ నవమి సోమవారం శ్రీ మహిషాసురమర్దనిదేవిగా దుర్గమ్మ భక్తకోటికి దర్శనమివ్వనుంది. వాస్తవానికి ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ సహజ స్వరూపం ఇదే. అందుకే ఈ అవతారంలో అమ్మవారిని దర్శించుకోవటం వల్ల అరిషడ్వర్గాలు నశిస్తాయని, సాత్విక భావం ఉదయిస్తుందని, సర్వదోషాలు పటాపంచలవుతాయని, ధైర్య స్థైర్య విజయాలు చేకూరుతాయన్న నమ్మకంతో భక్తులు దర్శించుకోబోతున్నారు. దుర్గమ్మ ఈ అవతారంలో అష్ట్భుజాలతో అవతరించి సింహవాహంపై దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దేవతలు, రుషులు, మానవుల కష్టాలను తొలగించింది.