ఆంధ్రప్రదేశ్‌

శ్రీరాజరాజేశ్వరీదేవిగా జగన్మాత దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 9: దసరా శరన్నవవరాత్రికు ముగింపు పలికే పదోరోజైన ఆశ్వయుజ శుద్ధదశమి మంగళవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మోత కనకదుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్త కోటికి దర్శనమిచ్చింది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులతో విర్రవీగిన దుష్టరాక్షసులను వివిధ అవతరాల్లో సంహరించి చుతుర్దశ భువన సామ్రాజ్ఞిగా పట్ట్భాషిక్తురాలైన శ్రీదుర్గాదేవి ఇంద్రకీలాద్రిపై విజయదశమి రోజున శ్రీరాజరాజేశ్వరరీదేవి అలంకారంతో అశేష భక్తజనానికి దర్శనమిచ్చింది. శత్రు సంహారం అనంతరం శాంతమూర్తిగా శ్రీరాజరాజేశ్వరీదేవి అలంకారంతో దర్శనమిచ్చిన తమ ఇష్టదేవత దుర్గదేవిని చూసేందుకై గడచిన పదేళ్లలో లేని విధంగా భారీసంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు దీరారు. అమ్మ దర్శననాంతరం ఎంతగానో పరవశించిన భక్తులు వేనోళ్ల కీర్తిస్తూ భక్త ప్రపత్తులతో మనసారా కొలిచారు.స్వయంవ్యక్త పరంజ్యోతిగా ఉండే రాజరాజేశ్వరీదేవి లేతపచ్చ వస్త్రాన్ని ధరించి చైతన్య రూపశక్తిగా చెరకు చాపం చేబూని భక్తుల దర్శన భాగ్యం కలుగజేసింది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహించే ఈ శక్తి స్వరూపిణికి పాయసం, చక్రాన్నం, దద్దోజనం, గారెలు, పూర్ణాలు కదంబ పులిహోర, కేసరి... ఇలా పది రకాల రాజభోగాలను అర్చకులు నైవేద్యంగా సమర్పించారు. చివరిరోజైన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర డీజీపీ దామోదర గౌతంసింగ్, ఎంపీ కనకమేడల రవీంద్ర, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి వెంకటేశ్వరరావు(నాని), పోలీస్ కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు దంపతులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఎంవి సురేష్‌బాబు నేతృత్వంలో ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పల్కి దుర్గమ్మ ఆశీస్సులందజేసి అమ్మవారి ప్రసాదాలను చిత్రపటాలను బహూకరించారు.
మానవత్వం చాటుకున్న ఉపముఖ్యమంత్రి
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళవారం క్యూలైన్‌లో ఐదు గంటల పాటు చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన అంధుడైన భవానీ దీక్షాపరుడు వెంకటరమణను గుర్తించిన నారాయణస్వామి తక్షణమే స్పందించి ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి దర్శనానికి తనవెంట తీసుకెళ్లారు. అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించినా ఒక్కసారిగా భక్తుల తాకిడి అధికమవడం వల్ల ఈ వ్యక్తి చిక్కుకునిపోయాడు.
స్పృహ తప్పిపడిపోయిన భక్తురాలు
కృష్ణాజిల్లా నిలదరువు గ్రామానికి చెందిన భక్తురాలు వాకలమ్మ బుధవారం ఒక్కసారిగా స్పృహ తప్పిపడిపోగా వైద్యులు మీడియా పాయింట్‌లోని పోడియం పైకి చేర్చి సెలైన్ బాటిల్ కట్టి వైద్యం చేశారు.
ప్రజలంతా సుఖఃసంతోషాలతో
వర్థిల్లాలి: మంత్రి కొడాలి
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర ఫౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు రాష్ట్ర ప్రజలకు ఉండాలని కూడా వేడుకున్నానన్నారు.
శాంతిభద్రతలు భేషుగ్గా
ఉండాలని కోరుకున్నా: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం లేకుండానే భేషుగ్గా ఉండాలని పోలీస్ యంత్రాంగానికి మరింత శక్తిని ప్రసాదించాలని తాను దుర్గమ్మను కోరుకున్నట్లు డీజీపీ దామోదర గౌతం సవాంగ్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయంటూ ప్రస్తుతించారు.
*చిత్రం...శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అమ్మవారు