ఆంధ్రప్రదేశ్‌

అక్రమ రవాణా బాధితులకు మానసిక చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 10: అక్రమ రవాణా బాధిత మహిళలు, బాలికలకు మానసిక చికిత్స అవసరమని స్వచ్ఛంద సంస్థలు అభిప్రాయపడ్డాయి. వారికి మానసిక చికిత్స అందించకుండా పునరావాసం పేరిట షెల్టర్ హోమ్స్‌లో నెలలు, సంవత్సరాల తరబడి నిర్బంధిస్తున్నారని హెల్ప్ సంస్థ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్, అక్రమ రవాణా బాధితుల రాష్ట్ర సమాఖ్య విముక్తి కన్వీనర్ హసీనా గురువారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల మానసిక సమస్యలు, వారి మానసిక పరిస్థితిపై తాము నిర్వహించిన ఓ సర్వేలో వ్యభిచార కూపాల నుంచి బయటపడిన వారందరూ నూటికి నూరు శాతం మంది ఒంటరితనం, నిస్సహాయత, తిరస్కరణ, సామాజిక ఆందోళన భావాలను ప్రదర్శించారన్నారు. 87.3 శాతం మంది నిస్పృహలో ఉన్నారని, 12.7 శాతం మందికి కుంగుబాటులో ఉన్నారని, ఇది సాధారణ జనాభాతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ స్థాయిలో ఉందని అన్నారు. బాధితులను నెలలు, సంవత్సరాల తరబడి ఆశ్రయ గృహాలలో ఉంచడం ద్వారా వారికి పునరావాస సేవలు ఇచ్చినట్లుగా ప్రకటిస్తున్నారన్నారు. కాని వారు ఇంకా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఈ పునరావాస గృహాల్లో నాణ్యమైన సేవలు అందకపోవడం, ముఖ్యంగా వారి మానసిక ఆరోగ్యం సంబంధించి సేవలు అందకపోవడం, కనీసం శిక్షణ పొందిన కౌన్సిలర్స్ కూడా లేకపోవడంతో అక్కడ బాధితులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.