ఆంధ్రప్రదేశ్‌

మలేరియాపై యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 31: తూర్పు ఏజెన్సీలోని ఆదివాసీ గ్రామాల్లో మలేరియా వ్యాధి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లతో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది. మూడేళ్లపాటు నిర్వహించే ఈ ప్రాజెక్టును ఆయూష్ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు. మలేరియా నిర్మూలనకు, సోకకుండా ముందస్తు నివారణ మందులు హోమియోపతి వైద్యంలోనేవుంది. రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమియోపతి కాలేజి ఆధ్వర్యంలో ఈ పైలెట్ ప్రాజెక్టును కేంద్రం ప్రారంభించింది. మొత్తం 21 ఆదివాసీ గ్రామాలను ఎంపికచేసి మలేరియా నివారణ ప్రాజెక్టు చేపట్టారు. ఇందుకోసం ఐదుగురు వైద్య బృందం ప్రతీ నెలా ప్రతీ గ్రామాన్ని సందర్శించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటారు. ఈ ప్రాజెక్టులో కేటాయించిన నిధుల్లో 50 శాతం మందులకు, మిగిలిన 50 శాతం వైద్య ఖర్చులకు కేటాయించామని రాజమహేంద్రవరం అల్లు రామలింగయ్య హోమియోపతి కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ వెన్నా వీరభద్రరావు తెలిపారు. మన్యం ప్రాంతంలోని ప్రతీ గ్రామంలో వైద్య బృందం ముందుగా సర్వేచేసి, జ్వరపీడితులను గుర్తించి, వారికి పరీక్షలు నిర్వహించి, వ్యాధి సోకినవారికి వైద్య సేవలందిస్తున్నామన్నారు. జ్వర పీడితులకు మాత్రం ముందస్తుగా మలేరియా మందులను పంపిణీచేస్తారు. గత ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్టును చేపట్టి మలేరియా నివారణపై నెలవారీ నివేదికలు ప్రభుత్వానికి అందిస్తున్నారు. బొడ్లంక గ్రామంలో మొత్తం 325 మంది ఆదివాసీ జనాభాలో ఏప్రిల్ నెల వైద్య పరీక్షల్లో 200 మంది జ్వర పీడితులున్నట్టు తేలగా, అందులో 100 మందికి మలేరియా సోకినట్టు గుర్తించారు. జూలై నాటికి 62 మంది వరకు మలేరియా పీడితులు ఉన్నారు. ప్రస్తుతం జ్వర పీడితులు క్రమేణా తగ్గుతున్నారు. తేనెలమామిడిలో 31 మంది, నిమ్మచెట్టు బండ గ్రామంలో 17 మంది, ఉప్పరగోతుల గ్రామంలో 21 మంది, వేజువాడలో 32 మంది, ఉక్కులూరు గ్రామంలో 17 మంది, కుట్రవాడలో 36, మద్దులూరు 11, మారేడుమిల్లి 15, సున్నంపాలెం గ్రామంలో 20, గురమామిడిలో 41, దెందులూరులో 23, చిలకమామిడిలో 22, కొత్తపాకలలో 8 మంది, రంపలో 10, నరసాపురం గ్రామంలో 17, వాడపల్లిలో 12 మంది, సిరిగిందలపాడులో ఒకరికి, మారేడుమిల్లి ఆశ్రమ పాఠశాలలో 149 మందికి అత్యధికంగా మలేరియా సోకినట్టు గుర్తించారు. వీరందరికీ నెలా నెలా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ మందులు పంపిణీచేస్తున్నారు.