ఆంధ్రప్రదేశ్‌

రెండో విడత నీటి సరఫరాకు రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 1: చిత్తూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎండుముఖం పట్టిన వేరుశనగ పంటకు తొలివిడత నీటి సరఫరా రేపటిలోగా పూర్తి చేయనున్నట్లు రేపటి ఇన్‌చార్జి మంత్రి నారాయణ తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ నుంచి జిల్లాలో వేరుశనగ పంటకు నీటి సరఫరా విషయాన్ని సమీక్షించారు. పలువురు రైతులను నీటి సరఫరాలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖర్లతో మాట్లాడుతూ ఆగస్టులో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 84వేల ఎకరాల్లో పంట ఎండుముఖం పట్టిందని దీనికి నీరందించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు దాదాపు 90శాతం పంటకు నీరు అందించామని, రేపటి లోగా ఈ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. ఒక వేళ పంట నూర్పిడి సమయానికి వర్షం కురవకపోతే రెండో విడత రెయిన్ గన్‌ల ద్వారా నీటి సరఫరా అందిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 1010రెయిన్ గన్‌ల ద్వారా నీటి సరఫరా ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 2350 స్ప్రింక్లర్లు, 605 ఆయిల్ ఇంజన్లు, 15ఫైరింజన్లు, 200ట్యాంకర్ల ద్వారా పంటకు నీరందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఒక ఎకరా కూడా పంట ఎండిపోకూడదన్నదే తమ ధ్యేయమన్నారు.