ఆంధ్రప్రదేశ్‌

జిల్లాకో సాంస్కృతిక అకాడమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 12: రాబోయే తరాలకు సంస్కృతి, సంప్రదాయాలను అందించాల్సిన అవసరం ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆనందగజపతి ఆడిటోరియంలో విజయనగరం ఉత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాబోయే తరాలకు ఆస్తులు అందించడం కన్నా సంస్కృతి, సంప్రదాయాలను అందించడం గొప్ప విషయమని అన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లా కేంద్రంలో సాంస్కృతిక వికాస అకాడమీలు ఏర్పాటు చేసి వాటిలో కూచిపూడి, భరతనాట్యం, సంగీతం తదితర విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. మహర్షులు తపస్సు చేసిన ప్రాంతం కావడమేగాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పుట్టినిల్లు అని ఆయన అన్నారు. విద్య, కళలకు నిలయమైన విజయనగరంలో ఇటువంటి ఉత్సవాలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఉత్సవాలను కోట జంక్షన్ వద్ద డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆనందగజపతి ఆడిటోరియం వరకూ కొనసాగింది. అనంతరం టీటీడీ జేఈవో బసంతకుమార్, డీఐజీ ఎ.శ్రీనివాస్, ప్రొఫెసర్ సిమ్మన్న, వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషి, నటి పడాల కల్యాణి, మ్యుజీషియన్ సాయికుమార్, సామాజికవేత్త వి.రమేష్‌ను శాలువలతో సత్కరించారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షత వహించారు. కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, రాజన్నదొర, బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పాల్గొన్నారు.

*చిత్రం... విజయనగరం ఉత్సవ్ ప్రారంభోత్సవాల్లో మాట్లాడుతున్న పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు,
పక్కన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తదితరులు