ఆంధ్రప్రదేశ్‌

మృత శిశువు కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 1: పాత ప్రభుత్వాస్పత్రి మరోసారి తెరమీదకు వచ్చింది. కాన్పుల వార్డులో జన్మించిన ఓ బిడ్డ గతంలో మాయమైన సంఘటన మరవకమునుపే మరో వివాదం ఆస్పత్రిని చుట్టుముట్టింది. మృత శిశువుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఆస్పత్రి వైద్యులపై ఆందోళనకు దిగారు. తమ బిడ్డను తారుమారు చేశారంటూ సిబ్బందిపై చిందులు తొక్కారు. బిడ్డను మార్చేసి చనిపోయిన మగ శిశువును అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వాస్తవాలు విచారించగా మృత శిశువు తల్లిదండ్రులు శాంతించడంతో ఆందోళన సద్దుమణిగింది. వాంబే కాలనీకి చెందిన తొర్రగుంట్ల సునీత, రమేష్ దంపతులు కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సునీత కాన్పు కోసం గురువారం తెల్లవారుజామున పాత ప్రభుత్వాస్పత్రిలో చేరింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు కడుపులో మృత శిశువును గుర్తించి ఉదయం 10.30 గంటలకు చనిపోయిన మగ శిశువును బయటకు తీశారు. కొద్దిసేపటి తర్వాత బిడ్డను చూసిన తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర వేదనకు గురయ్యారు. కేసు షీటులో ‘బేబి’ అని రాసి ఉండటాన్ని చూసి తమకు ఆడపిల్ల పుడితే బిడ్డను తారుమారు చేసి చనిపోయిన మగ శిశువును చూపించారంటూ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత దంపతులు, కుటుంబ సభ్యులు, బంధువులు తమ బిడ్డను తమకు ఇవ్వాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.కాన్పుకు ముందే తాము స్కానింగ్, వైద్య పరీక్షల్లో గుర్తించామని వైద్యులు చెప్పారు. ఇక సౌత్ జోన్ ఎసిపి శ్రీనివాసరావు, గవర్నర్‌పేట సిఐ ఇ పవన్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగారు. మృతశిశువు ఎవరికి చెందిందో డిఎన్‌ఎ పరీక్షల ద్వారా తెలుస్తుందని, పోస్ట్‌మార్టం నిర్వహించడం ద్వారా కూడా వాస్తవాలు వెల్లడవుతాయని చెప్పడంతో తల్లిదండ్రులు తర్వాత శాంతించారు.