ఆంధ్రప్రదేశ్‌

రెయన్‌గన్‌ల పేరుతో రైతులకు దగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, సెప్టెంబర్ 1: లక్షల ఎకరాల్లో వేరుశెనగ పంట ఎండిపోయి అనంతపురం జిల్లా రైతులు తీవ్ర కష్టనష్టాలతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు జల ఫిరంగుల పేరిట రైతులను మరోసారి దగా చేయడానికి ఉపక్రమించారని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన బెంగళూరు నుండి పులివెందులకు వెళ్తూ మార్గమధ్యంలో అనంతపురం జిల్లా గోరంట్ల సమీపంలోని మారెమ్మ దేవాలయం వద్ద ఎండిన వేరుశనగ పంటను పరిశీలించారు. పొలాల్లోని రైతులు అంజినప్ప, రంగప్పతో పంట పరిస్థితిపై ఆరా తీశారు. తమకు రుణమాఫీ అమలు కాలేదని....ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదని...పైగా పంట సాగు చేయడానికి మరో రూ.60 వేలు అప్పులు చేశామని వారు వాపోయారు. పంట పూర్తిగా ఎండిపోయిందని, ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేదని కంటతడిపెట్టారు. రెయిన్‌గన్ల ద్వారా ఏదైనా లాభం ఉందా అని జగన్ ప్రశ్నించగా నీళ్లే లేకపోతే రెయిన్‌గన్లు ఏం చేసుకోవాలని అన్నారు. జగన్ విలేఖరులతో మాట్లాడుతూ రైతులను ఆదుకోకపోగా అబద్ధాలతో ముఖ్యమంత్రి కాలం వెళ్ళబుచ్చుతున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో 8 లక్షల హెక్టార్లలో వేరుశెనగ పంట సాగు చేయగా అందులో 7 లక్షల హెక్టార్లలో పంట ఎండుతోందన్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం 61 వేల హెక్టార్ల పంటలు ఎండుతున్నాయని, 42 వేల హెక్టార్లకు రక్షక తడులు అందించి కాపాడామంటూ అవాస్తవాలు ప్రచారం చేయడం దారుణమన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రచారయావలో నానాయాగీ చేస్తోందన్నారు. కడపటకి రెయిన్‌గన్లు కూడా తానే కనిపెట్టానంటూ ఫోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు సమస్యలపై నిర్వహించాల్సిన సమావేశాలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వారిని గాలికి వదిలేస్తున్నారన్నారు. జూన్ 7న నిర్వహించాల్సిన ఎస్‌ఎల్‌బిసి సమావేశాన్ని ఆగస్టు 12వ తేదీకి వాయిదా వేశారని, తర్వాత కూడా అసెంబ్లీ సమావేశాల తర్వాత నిర్వహిస్తామంటూ మరోసారి వాయిదా వేసి రైతులను నట్టేట ముంచారన్నారు. బ్యాంకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి రుణ ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమ ర్శించారు. కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, నాయకులు రమణారెడ్డి, ఫకృద్దీన్‌సాబ్ తదితరులు ఉన్నారు.

చిత్రం.. అనంతపురం జిల్లా గోరంట్లలో ఎండిన వేరుశనగ పంటను పరిశీలిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్