ఆంధ్రప్రదేశ్‌

పట్టిసీమ పచ్చి బోగస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 2: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పచ్చి బోగస్ అని, రూ.400 కోట్లు అదనంగా చెల్లించారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ ఆరోపించారు. ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో బహిరంగంగా నిరూపించడానికి సిద్ధమని, ప్రభుత్వం తరఫున ప్రతినిధులెవరినైనా పంపించాలని ఆయన సవాల్‌చేశారు. రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టిసీమ విషయంలో ఏదో సాధించినట్టు చెబుతూ విమర్శించిన వాళ్లను అభివృద్ధి నిరోధకులుగా ప్రభుత్వం పేర్కొంటోందని, అయితే పట్టిసీమ అనేది వట్టి బోగస్ అన్నారు. నాలుగు వందల కోట్లు అదనంగా చెల్లించారని, 80 టిఎంసిలు కృష్ణాకు మళ్ళించడమనేది పచ్చి అబద్ధమన్నారు. రిజర్వాయర్ స్టోరేజి మానిటరింగ్ సిస్టమ్ డేటాలో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం పట్టిసీమకు జూలై 6న ముఖ్యమంత్రి చంద్రబాబు స్విచ్ ఆన్ చేసేటపుడు 606 క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి వృధాగా పోయాయని, జూలై 13 నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజులు తప్పించి, మిగిలిన అన్ని రోజులు నీరు వృథాగా సముద్రం పాలవుతోందన్నారు.
అదేవిధంగా ఆగస్టులో 11, 12 తేదీలు తప్పించి మిగిలిన అన్ని రోజుల్లోనూ కృష్ణా నీరు సముద్రం పాలవుతోందని ప్రభుత్వ నివేదికలను బట్టి తెలుస్తోందన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ రెండు నదులకు వరదలు ఉంటాయనేది గత పదేళ్ల చరిత్రను బట్టి చెబుతూనే వున్నామని, ఇది కాదంటూ గోదావరిలో లక్షలాది క్యూసెక్కులు సముద్రం పాలవుతున్నట్టు ప్రభుత్వం మాయచేస్తోందన్నారు. పట్టిసీమ పథకం ద్వారా 80 టిఎంసిల నీరు తోడటానికి రూ.1600 కోట్లు అవసరం లేదని ఎప్పటినుంచో చెప్తునే ఉన్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించకపోతే నిష్కృతి లేదన్నారు. అన్ని సమస్యలకు పోలవరమే పరిష్కారమన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకే అమరావతిలో రాజధాని నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పడం విడ్డూరంగా ఉందని, కమిటీ సిఫార్సులకు పూర్తి విరుద్ధంగా రాజధాని నిర్మాణం జరుగుతోందన్నారు. తుపాన్లువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ప్రాంతంగా అమరావతిని పేర్కొంటూ, అక్కడ రాజధాని వద్దని శివరామకృష్ణన్ నివేదికలో వివరించారన్నారు. అందుకు సంబంధించిన ప్రతులను ఉండవల్లి బహిర్గతంచేశారు.
అమరావతిలో రాజధాని నిర్మాణం ఆత్మహత్యా సదృశమని శివరామకృష్ణన్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారన్నారు.మంత్రి నారాయణ విద్యా సొసైటీతోనే విద్యారంగం దోపిడీపై పోరాటానికి సన్నద్ధమవుతున్నానని ఉండవల్లి ప్రకటించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న సొసైటీలు గానీ, విద్యా సంస్థల గురించి గానీ తనకు తెలియజేస్తే చట్టబద్ధమైన రీతిలో విద్యా వ్యాపారాన్ని, విద్యా దోపిడీని ఆపేందుకు పోరాటం సాగిస్తానని ఆయన ప్రకటించారు.