ఆంధ్రప్రదేశ్‌

అర్చకత్వ హక్కుపై తుది నోటిఫికేషన్ జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: రాష్ట్రంలో సంప్రదాయ దేవాలయ వ్యవస్థను పరిరక్షించే చర్యల్లో భాగంగా అర్చకత్వ హక్కుకు అర్హతలు, తదితర అంశాలపై తుది నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. మిరాసీదార్లు, అర్చకుల వారసత్వ హక్కు రద్దు చేసినప్పటికీ, అర్చక కుటుంబానికి చెందిన వ్యక్తి, అర్చకత్వానికి అర్హత ఉన్న వ్యక్తి, ఇప్పటికే అర్చకునిగా వ్యవహరిస్తున్న వ్యక్తిని కొంత మొత్తం చెల్లించి అర్చకునిగా కొనసాగించే వీలు ఉంది. వారసత్వ అర్చకత్వ హక్కుకు సంబంధించి 2017 ఫిబ్రవరిలో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయగా, దీనిపై వచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్‌ను జారీ చేశారు. వారసత్వ పథకం కింద అర్చక, ప్రధాన అర్చక కేటగిరీలను ఏర్పాటు చేశారు.
ఉల్లి కొనుగోలుకు రూ. 3 కోట్ల కేటాయింపు
మార్కెట్‌లో ఉల్లి ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ధరను స్థిరీకరించేందుకు వీలుగా 3 కోట్ల రూపాయలను సెంట్రల్ మార్కెట్ ఫండ్ నుంచి ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ఉల్లిని కొనుగోలు చేసి మార్కెట్‌లోకి రాయితీపై పంపిణీ చేయాల్సి ఉంటుంది.
అదే విధంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద నమోదైన ఆసుపత్రుల్లో నాణ్యతా పరిశీలన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
విశాఖకు రూ. 186 కోట్లు కేటాయింపు
విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 186 కోట్ల రూపాయలను స్మార్ట్ సిటీ మిషన్ కింద కేటాయించారు. గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు ఈ నిధులు జమ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.