ఆంధ్రప్రదేశ్‌

అధికారం కోల్పోయాక శ్రీరంగనీతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: గత ప్రభుత్వ హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు అధికారం పోయాక శ్రీరంగనీతులు చెబుతున్నారని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారన్న విమర్శలపై విజయసాయిరెడ్డి సోమవారం ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. చంద్రబాబు 2.60 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, రూ.60వేల కోట్ల పెండింగ్ బిల్లులు మిగిల్చి వెళ్లారని, దేశంలోని అత్యంత అసమర్థ ఆర్థిక మంత్రిగా యనమల రామకృష్ణుడు రికార్డులకెక్కారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. జగన్ సొంత ప్రతిష్టను పెంచుకోవడానికి అప్పు చేసి పప్పుకూడు పెడుతున్నారని ఏడుపు రాగాలు తీస్తున్నారంటూ ఒక మీడియా అధినేతపైనా విజయసాయి విమర్శలు గుపించారు. దేశంలోనే అత్యంత అసమర్థ ఆర్థిక మంత్రిగా యనమల రికార్డులకెక్కారన్నారు. అధిక వడ్డీ ఆశ చూపి దొరికిన చోటల్లా అప్పు చేసి బోర్డు తిప్పేసే ఫైనాన్స్ కంపెనీ కంటే దారుణంగా యనమల హయాంలో ఆర్థిక నిర్వహణ సాగిందని వ్యాఖ్యానించారు.