ఆంధ్రప్రదేశ్‌

బెంతు ఒరియాలపై సర్వేకు ఏకసభ్య కమిటీ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, అక్టోబర్ 22: బెంతు ఒరియాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వన్‌మ్యాన్ కమిటీ నియమించిందని ఆ కమిటీ చైర్మన్ జేసీ శర్మ అన్నారు. మంగళవారం పలాస తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి అధికారులతో మాట్లాడారు. బెంతు ఒరియాలు ఎస్సీ, ఎస్టీ ఏ కులానికి చెందుతారో తెలియక ఇబ్బందులు పడుతున్నారని, బెంతు ఒరియాల సమస్యలను పరిష్కరించేందుకు తాము క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వచ్చానన్నారు. ఇచ్ఛాపురం మండలంలో మాణిక్యపురం, కుక్కిలపుట్టుగ గ్రామాల్లో వున్న బెంతు ఒరియాల స్థితిగతులను పరిశీలించామన్నారు. 1950 నుంచి గత 40 ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారం కాలేదని, ప్రభుత్వం వీటిపై వన్‌మ్యాన్ కమిటీ నియమించి సర్వేకు ఆదేశించారన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఈ ప్రాంత బెంతు ఒరియా సన్యాసి ఆప్టో, ప్రదాన్‌లు కలుసుకొని తమ సమస్యలను వివరించారు. 1985 సంవత్సరం వరకు తమకు ఎస్టీ ధ్రువపత్రం మంజూరు చేసారని, అనంతరం ఎస్టీ ధ్రువపత్రం ఇవ్వకుండా నిలుపుదల చేయడం వల్ల తమ పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎస్టీ ధ్రువపత్రాలను మంజూరు చేయాలని కోరారు. గిరిజన సంఘాల నాయకులు సవర జగన్నాయకుల కమిటీతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వున్న బెంతు ఒరియాలు నిజమైన బెంతు ఒరియాలు కారని, నకిలీ బెంతు ఒరియాలు అని, వారికి ఎస్టీ ధ్రువపత్రం ఇవ్వొద్దని, విజయనగరం జిల్లా సాలూరులో వున్నవారు నిజమైన బెంతు ఒరియాలు అని తెలిపారు. దీనిపై పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, ఆర్డీవో కిషోర్, కమిటీ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు రిటైర్డ్ ప్రొఫెసర్ బాబు, సతీష్, తహశీల్దార్ బాబ్జీరావు, వైసీపీ నేతలు దువ్వాడ శ్రీకాంత్, హనుమంతు వెంకటరావుదొర, డబ్బీరు భవానీ, బల్ల గిరిబాబు, ఎంఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.