ఆంధ్రప్రదేశ్‌

వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడే అవకాశాలున్నాయి. ఇది రాగల 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో విస్తృతంగా వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్లు కుండపోత వర్షాలు పడతాయన్నారు. తీరం వెంబడి తూర్పు దిశ నుంచి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.