ఆంధ్రప్రదేశ్‌

జనానికి మేలు చేయని ఇసుక పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 22: రాష్ట్రంలో అధికారం చేపట్టిన వైసీపీ ఐదు నెలలు నిండకుండానే ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేలా నిర్ణయాలు తీసుకుంటోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విలేఖరులతో మాట్లాడుతూ నూతన ఇసుకపాలసీతో వైసీపీ నేతల జేబులు నిండుతున్నాయే తప్ప ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదని విమర్శించారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లా శ్రీనివాసుతో కలిసి ఆలపాటి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమం చూసి తెలుగుదేశం పార్టీ నేతలు ఓర్వలేకపోతోందని మంత్రులు అంటున్నారని, అంత మంచి పనులు ఈ ప్రభుత్వం ఏం చేసిందో చేప్పాలని అనగాని సవాల్ చేశారు. గత ప్రభుత్వం ఇసుక సరఫరాను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసి, అవినీతికి పాల్పడిందని ఆరోపించిన వైసీపీ పెద్దలు కొత్త ఇసుక విధానంతో ప్రజలకు ఏ మేరకు మేలు జరిగిందో చెప్పాలని ఆలపాటి ప్రశ్నించారు. నూతన విధానం పేరుతో 30 లక్షల మంది భవన నిర్మాణ రంగ కార్మికులను జీవనాన్ని, 125 రకాల వృత్తులను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. ఈ విధానంతో కార్మికుల ఉపాధి మాట అటుంచితే రాష్ట్రంలో కొత్త మాఫియా పుట్టుకొచ్చిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్ చేసిన తొలిసంతకం నుండి ఇటీవల తీసుకున్న మీడియాపై ఆంక్షల వరకు ప్రతీ నిర్ణయం ప్రజావంచక, ప్రజావ్యతిరేక, అప్రజాస్వామికమైనవేనని అనగాని ఆరోపించారు. అలాంటి పాలనను చూసి మేం అసూయపడుతున్నామనడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం రాష్ట్రంలోని సమస్యల గురించి, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన గురించిన వివరాలనైనా బహిర్గతం చేసే ధైర్యం మంత్రులకు ఉందా ? అంటూ ప్రశ్నించారు. జగన్ పాలనలో అమరావతి ఆగిపోయింది, అన్నార్తులు ఆకలితో అలమటిస్తున్నారు, కూలీలు కూటికోసం రోడ్డెక్కాల్సిన దుస్థితిని చూశా మేము అసూయ పడుతోందని ఎద్దేవా చేశారు. నాలుగు నెలల రివర్స్ పాలన చూసి ప్రజలంతా చీదరించుకుంటున్న వాస్తవాన్ని గ్రహించాలన్నారు.