ఆంధ్రప్రదేశ్‌

నీటి సరఫరా ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: రాష్ట్రంలో 13 జిల్లాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఉద్దేశించిన ప్రాజెక్టులకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఏపీ తాగునీటి సరఫరా కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజారు చేసింది. 13 జిల్లాలో నూరుశాతం తాగునీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో మార్పు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. 3 దశల్లో అమలు చేసే ఈ ప్రాజెక్టుకు దాదాపు 50 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మంచినీటి సరఫరాను దాదాపు 600 కోట్ల రూపాయలతో చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 105 ఎల్పీసీడీలు, పట్టణాల్లో 135, నగరాల్లో 150 ఎల్పీసీడీలను సరఫరా చేసేందుకు ప్రతిపాదించింది. భారీ ప్రాజెక్టు కావడంతో నిధులను వివిధ బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా సమీకరించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రుణాన్ని తీసుకునేందుకు వీలుగా అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.