ఆంధ్రప్రదేశ్‌

హైకోర్టు తరలింపు ఉద్యమం విరమించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు లీగల్, అక్టోబర్ 23: రాజకీయ నాయకులు, పత్రికల్లో పేర్కొంటున్న అంశాలను పరిగణలోకి తీసుకుని, రాష్ట్ర హైకోర్టును అమరావతిలోని నేలపాడు నుండి తరలిస్తున్నారన్న అంశం కేవలం ఊహాగానంగానే న్యాయవాదులు పరిగణించాలని, ఇటువంటి వదంతులపై ఉద్యమాలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రాష్టవ్య్రాప్తంగా ఉన్న జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదుల ప్రతినిధులతో హైకోర్టు నుండి జస్టిస్ మహేశ్వరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు, ప్రతినిధులు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, బార్ అసోసియేషన్ల అధ్యక్షులు, ఆయా జిల్లా కలెక్టరేట్‌లలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరాల నుండి హాజరయ్యారు. వీరినుద్దేశించి జస్టిస్ జితేంద్రకుమార్ మాట్లాడుతూ హైకోర్టుల ఏర్పాటు, తరలింపు అంశం రాష్టప్రతి, కేంద్రప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని, ఇప్పటివరకు వారి నుండి ఎటువంటి సమాచారం లేదనే అంశాన్ని న్యాయవాదులంతా గుర్తించాలన్నారు. అనుకున్న వెంటనే హైకోర్టు తరలింపు సాధ్యపడే అంశం కాదని, రాష్ట్ర హైకోర్టుకు గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఎటువంటి ప్రమేయం ఉండదనేది కూడా గుర్తించాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఎవరికి వారు తమకే హైకోర్టు కావాలనడం హాస్యాస్పదంగా ఉందని, ఈ క్రమంలో కక్షిదారుల సమస్యలను పట్టించుకోక పోవడం సమంజసం కాదని, ఈనెల 28వ తేదీలోగా ఉద్యమ విరమణ అంశంపై ఒక స్పష్టమైన అవగాహనకు న్యాయవాదులంతా రావాలని సూచించారు. అనంతరం అన్ని జిల్లాల ప్రతినిధుల నుండి జస్టిస్ మహేశ్వరి అభిప్రాయాలను సేకరించారు. ఎక్కువ శాతం న్యాయవాదులు అమరావతిలోనే హైకోర్టు కొనసాగాలని కోరుతూ ఈ అంశాన్ని కేంద్రప్రభుత్వానికి, రాష్టప్రతికి విన్నవించాలని కోరారు.