ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జిల్లాలను వీడని వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 23: గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో గోదావరి జిల్లాలు తడిసిముద్దవుతున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అధ్వాన్నంగా తయారైన రహదారులపై వాహనాలు మొరాయిస్తున్నాయి. దీనితో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే వర్షపు నీటితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో రహదారులను వర్షపునీరు ముంచెత్తడంతో మోటార్ల సాయంతో నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో వాగులు పొంగుతున్నాయి. వరి చేలు నేలనంటి, నీటిలో నానుతున్నాయి. పాలుపోసుకనే దశలో ఉన్నందున నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. అయితే మెట్ట పంటలకు వర్షాలు మేలుచేస్తాయని భావిస్తున్నారు. వర్షాలకు నానిపోయి పలు ప్రాంతాల్లో పూరిళ్లు కూలిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో బుధవారం ఇంటి గోడ కూలి పెద్దిరెడ్డి రాఘవమ్మ (73), సిరివరపు శ్రీను (40) మృతిచెందారు. వర్షాల కారణంగా నీరు కారకుండా ఇంటి పైకప్పుపై బరకం వేసే ప్రయత్నంలో గోడకూలి వీరు మృతిచెందారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని వట్టిగెడ్డ వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాజవొమ్మంగి నుండి పలు గ్రామాలకు రాకపోకలు రోజంతా నిలిచిపోయాయి. మడేరువాగు పొంగి ప్రవహించడంతో అనంతగిరి,చీడిపాలెం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయారు. జడ్డంగి సమీపంలో మడేరు ఆనకట్టవద్ద ఇనుప గేట్లు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి.

*చిత్రం... తూర్పు గోదావరి జిల్లాలో నేలనంటి నీటిలో నానుతున్న వరి చేను