ఆంధ్రప్రదేశ్‌

మహిళల సమస్యలపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్థాయి, పట్టణస్థాయి నుండి చైతన్యపర్చి పోరాటాలు సాగించి పాలకుల మెడలు వంచాలని పిసిసి అధ్యక్షులు, మాజీమంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. స్థానిక గవర్నరుపేట ఆంధ్రరత్నభవనం నందు నూతనంగా నెలకొల్పబడిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ నాయకురాలు ప్రమీలమ్మను ఘనంగా సత్కరించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత దేశ, రాష్టల్రలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలపై బాధ్యత పెరిగిందని అందుకు యువత కాంగ్రెస్ వారితో కలిసి సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, నూనె, కిరోసిన్, కందిపప్పు, మినపప్పు, పెట్రోలు వంటివి ఆకాశాన్ని అంటాయని, పొదుపు సంఘాల రుణమాఫీ విషయంలో టిడిపి ప్రభుత్వం మహిళల్ని మరోసారి మోసగించిందన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఆడవాళ్లు ఎవ్వరూ వంట వారు చేసుకుని తినే పరిస్థితి లేనంతగా ధరలు పెరిగాయని, మహిళలకు ఇంటా బయటా రక్షణ కరువైందని, విద్యాలయాల వ్యాపారాలుగా మారాయని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దేవినేని అవినాష్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.