ఆంధ్రప్రదేశ్‌

ఉద్యాన పంటలకు రూ. 19.08 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 28: కడప, అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 19.08 లక్షల రూపాయలను కేటాయిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు అయిన ఖర్చులో 80 శాతాన్ని ఈ నిధుల నుంచి రాయితీగా చెల్లిస్తారు. ఈ రెండు జిల్లాల్లో 45,629 ఎకరాల్లో నిమ్మ, మామిడి, దానిమ్మ, తీపి నారింజ, జామ, ద్రాక్ష, సపోటా తదితర పంటలను సాగు చేస్తున్నారు. వర్షాభావం, నీటి సమస్య వల్ల పంట దెబ్బతినే అవకాశం ఉందని ప్రభుత్వ దృష్టికి ఉద్యాన శాఖ అధికారులు తీసుకువెళ్లారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ, మార్గదర్శకాలను జారీ చేసింది. బోరు వెల్స్ ఎండిపోయిన రైతులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఒక కుటుంబానికి ఐదు ఎకరాలకు మాత్రమే వర్తిసుంది.